Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జ‌న‌వ‌రి 1న‌, జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు | NO RECOMMENDATION LETTERS WILL BE ENTERTAINED ON JAN 1 AND VAIKUNTA DWARA DARSHAN DAYS

జ‌న‌వ‌రి 1న‌, జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం.

భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు.

సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని, వారి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలియ‌జేయ‌డ‌మైనది. భ‌క్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని కోర‌డ‌మైన‌ది. శ్రీ‌వారి ఆలయంలో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాదశి, జ‌న‌వ‌రి 14న‌ వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులకు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సంతృప్తిక‌ర‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌డుతోంది. ఈ ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించ‌నుంది.


గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు

– జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.


శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.


జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.


కల్యాణకట్ట

తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచడం జరిగింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పిపిఇ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారు.


అన్నప్రసాదం

అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల‌ పాటు ఉదయం 4 నుండి రాత్రి 12 గంటల‌ వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.


వైద్యం

భక్తుల‌కు వైద్యసేవ‌లందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి.


పార్కింగ్‌

తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు.

కోవిడ్ నిబంధనలు

కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి..

– కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. అదేవిధంగా, కొన్ని ప‌ట్ట‌ణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి.

– టిటిడి ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

tirumala news today live, tirumala news, ttd online, tirupati news, ttd news darshan timings today, tirumala news today telugu, ttd toll free number, tirupati darshan 500 rupees ticket, tirumala vip letters, tirumala darshnam mla mp letters

Comments