Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ధనస్సురాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Dhannus Rasi Phalalu 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 ధనస్సురాశి ఫలితములు 

మూల 1,2,3,4 పాదములు పూర్వాషాఢ 1,2,3,4 పాదములు

ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం 2

వ్యయం 8

రాజపూజ్యం 5

అవమానం 1

జనవరి: ఈ నెలయందు ఆత్మ విశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శుభఫలితం పొందుతారు. మిశ్రమ కాలం నడుస్తుంది. ఉద్యోగులకు మిశ్రమాదా యము. భార్యాబిడ్డల సౌఖ్యము ఉంటుంది. అన్ని విషయాలు ఆలోచించి నడచు కోవాలి. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆర్ధిక అంశాలు బాగుగాయున్నాయి. గణేశ హోమము చేయించండి. నూతన ప్రయత్నములు రాణించగలవు.


ఫిబ్రవరి : ఈ నెలయందు చిత్తశుద్ధితో పరిశ్రమ చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారము అందు ధనాదాయము ఉన్నది. ఉద్యోగంలో శ్రమయుంటుంది. సమస్యలున్నా జాగ్రత్తపడాలి. ఆర్థిక సమస్యలను బుద్ధి బలంతో అధిగమించాలి. క్రొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టండి. ఆరోగ్యము బాగుగాయుంటుంది. సుబ్రహ్మణ్యస్వామి పూజలు చేయండి. సంతాన విషయాలు అన్నియునూ అనుకూలముగానుంటాయి.


మార్చి : ఈ నెలందు అదృష్టయోగం వరిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలరు. ప్రయాణ ములు కలిసివస్తాయి. గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మిశ్రమాదాయము లభించును. శారీరకశ్రమ కలుగుతుంది. ద్వారా ఆపదలు కలుగవచ్చును. విష్ణు దర్శనం చేయవచ్చును. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించుకోండి. తిరుపతి ప్రయాణము చేయగలరు..


 ఏప్రియల్ : ఈ నెలయందు అభిష్ట సిద్ధి లభిస్తుంది. ప్రయాణములు విజయం చేకూరును. ముఖ్య కార్యాల్లో అతి వేగంగా పనిచేస్తారు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. ధర్మ మార్గంలో సంచారం చేయుట మంచిది. మొహమాటం పనికిరాదు. ప్రతి విషయాన్ని నిఖచ్చితో వ్యవహరించండి. ఇంట్లో శుభాన్వేషణలు జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయాలు పరిస్థితుల ప్రభావంతో నడచుట మంచిది.


మే : ఈ నెలయందు ఉత్సాహంతో కృషిచేసి విద్యార్థులు ముందు చూపును ఆలోచించండి. అన్ని వసతలు అనుకూలంగా ఉన్నాయి. మీ నవీన పథకాలు, ఆలోచనలు ఆకట్టుకుంటాయి. క్రయ విక్రయాలు చురుగ్గా సాగుతాయి. ఆశించిన ఆదాయములు లభించును. ఉద్యోగ వ్యాపార వృత్తులు సామాన్య ధనాన్ని పొందుతారు. దూర ప్రయాణములు చేస్తారు. ఆధునిక విజ్ఞానముతో సంచరిస్తారు. రోజువారిగా పనులు బాగుగా సాగుతాయి. ఆంజనేయస్వామి పూజలు అనుకూలించగలవు.


జూన్: ఈ నెలయందు మాటపట్టింపునకు తావీయవద్దు. స్వార్థ జీవనం ముఖ్యము. ధనవిషయాలు ముఖ్యము. విదేశీ ప్రయాణీకులు కలుస్తారు. పూర్వ స్నేహితులు ఆనందించెదరు. రాజకీయ విజ్ఞాన రంగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విందులు వినోదాలద్వారా ఉల్లాసం పొందుతారు. వృత్తులు ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రతి పనికూడ ఇబ్బందులు, ఆందోళనలుగా మారుతాయి.

జూలై : ఈ నెలయందు బంధుమరణ వార్తలు వింటారు. ఋణములు భూ వసతులు కలుగుతాయి. శుభకార్య వ్యయము అధికము. వ్యాపార ద్వేషములు అధికము. మనోవేదనలు కలుగును. వస్తు ఆభరణ లాభాదులు కలుగుతాయి. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. కొద్ది అనారోగ్యము కలుగుతుంది. ఆకస్మిక కోర్టు వ్యవహారాలు రావచ్చును. హృదయ సంకట విషయాలు వస్తాయి. భయము చెందవద్దు. తిరుపతి దేవుడు మిమ్ములను కాపాడుతారు. బంధు సందర్శనము కలుగుతుంది.


ఆగష్టు : ఈ నెలయందు కొంత అనారోగ్యము రావచ్చును. ప్రయత్నించిన పనులు పూర్తి విజయం కలుగుతుంది. విద్యా విజయము కలుగుతుంది. ఇంటియందు పిల్లల చదువుల సమస్యలు ఆందోళనలు వస్తాయి. అధికారులు సందర్శనలు చేస్తారు. ఋణములు కొన్ని తెస్తారు. ఉద్యోగము లందు ప్రమోషన్స్ లభించును. అనుకోని ఆపదలనుండి గట్టెక్కుతారు. సంతాన చర్చలు సఫలము అగును. నాగేంద్రపూజలు కూడ చేయుము.


సెప్టెంబర్ : ఈ నెల కుటుంబములో ఔషధ సేవలు పెరుగును. ధనవ్యయము కలుగుతుంది. గ్రహస్థితి మిశ్రమము. బంధువైరములు అధికము. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో పనులు అనుకూలము. ప్రయత్నించిన పనులు లాభిస్తాయి. సాంకేతిక రంగాల్లో విజయం సాధిస్తారు. స్త్రీ వలసే ధనయోగము. పుట్టినింటి మన్ననలు పెంపొందించుకుంటారు. మిశ్రమదాయము అన్నిరంగాలవార్కి ఉంటాయి. 


అక్టోబర్: ఈ నెల ఉద్యోగములందు స్థానచలన యోగములు కలుగును. చివాట్ల యోగములు లభించును. వృత్తియందు చీటికి మాటికి ఇబ్బందులు ధనరూపముగా వస్తాయి. బంధువుల వ్యతిరేకించెదరు. మిత్రులు ఆనందముతో ఓదార్చెదరు. వ్యాపారాల్లో వర్కర్లు చిన్న ఇబ్బందులను పెట్టెదరు. వృత్తి వ్యాపార రంగములు సమయమునకు ధనాన్ని సంపాదించెదరు.


నవంబర్: ఈ నెల ఉద్యోగములందు స్థానచలనములు కల్గును. గృహములు మారెదరు. ఉద్యోగ సీట్లు మారవచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. చీటికీమాటికి ఉద్యోగ నిందలు వస్తాయి. అన్ని రంగాల్లో ధనాదాయము యుండును. రాజకీయ వాదములు పెరుగును. చెన్నకేశవ పూజలు చేయండి. సంతాన విషయాలు అనుకూలము. పిల్లలు దూర ప్రయాణములు చెక్కేస్తారు. ఋణములు కొన్ని శాంతించును. వడ్డీల బాధలు అధికము.

డిశెంబర్: ఈ నెలయందు ఆత్మీ విశ్వాసంతో పనులు చేయండి. విద్యార్థుల పరీక్ష ఉత్తీర్ణతలను గూర్చి భయపడవద్దు. కర్తవ్యము ఆలోచించాలి. స్త్రీ సౌఖ్యము. మాటపట్టింపులు తొలగును. శారీక శ్రమ తగ్గును. జీవితం ఆనందమయంగా ఈ నెలలో ఉంటుంది. రాజకీయ బాధలు కొన్ని వస్తాయి. ఇంటియందు ఆరోగ్యములు కొన్ని లోపించును. ఔషధ చికిత్సలు అత్యవసరము.

Related Rashi Phalalu :

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనస్సురాశి, Dhannus Rasi Phalalu 2022, Sagittarius Horoscope 2022, dhanu rashi 2022 telugu, 2022 telugu rasi phalalu,2022 mesha rasi phalithalu, ధనుస్సు రాశి జాతకం

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు