Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వృశ్చికరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Dhannus Rasi Phalalu 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 వృశ్చికరాశి ఫలితములు 

విశాఖ 4వ పాదం, అనూరాధ 1,2,3,4 పాదములు

జ్యేష్ట 1,2,3,4 పాదములు

ఆదాయం 14

వ్యయం 2

రాజపూజ్యం 3 

అవమానం 1

జనవరి : ఈ నెలయందు ధనమును మంచి నీళ్ళవలె ఖర్చు చేస్తారు. మానసిక ఆందోళనలు కొన్ని వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారములు లభించవు. ప్రభుత్వ కార్యాల్లో స్త్రీలకు ఇబ్బందులు వస్తాయి. వ్యాపారరంగము వృత్తి రంగము సామాన్యముగా ధనలాభాదులు వస్తాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు సంభ వించును. దూరప్రయాణములు చేస్తారు. ఉద్యోగమునందు నిందలు కూడా రావచ్చును.


ఫిబ్రవరి : ఈ నెలయందు ఋణములు తీర్చెదరు. రావల్సిన ధనము వచ్చును. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ వాదులు తగు జాగ్రత్తగా పనియందు శ్రద్ధ చూపించాలి. అసంఘిత పనులకు దూరంగా యుండుట మంచిది. మార్చి : ఈ నెలయందు దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించి, కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వివాహము నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. సోదర వర్గము శుభ వర్తమానాలు పంపుతారు. అనుకోని ప్రయాణములు చేస్తారు. భాగస్వాములతో చర్చలు జరుపుతారు. మాతృ వర్గమున కొన్ని బాధలు తెస్తారు. వారాంతములో ప్రయాణములు వాయిదా వేయండి.


ఏప్రియల్ : ఈ నెలయందు అన్ని రంగములవారికి అధిక శ్రమ ముఖ్యముగా ఉంటుంది. కొన్ని ఋణములు తీర్చెదరు. దూర యాత్రలు చేస్తారు. బంధుమరణ చింతలు కల్గును. ఉద్యోగ వ్యాపార వృత్తులు మిశ్రమాదాయములుగా నుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయరంగాల జనులు శ్రద్ధతో సంచారము చేయుట మంచిది. ఆరోగ్యములు బాగుగా యుండగలవు. నగరములందు సంచారములు | తగ్గును. దైవపూజలు మంచివి.


మే : ఈ నెలయందు కొత్త మార్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కొత్త ఆలోచనలు చేస్తారు. పాత బాకీలు వసూలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చురుగ్గా సాగుతాయి. ఆదాయము సామాన్యము. భోజన సౌఖ్యము, శతృబాధలు, ఆరోగ్య భంగము కలుగుతాయి. వ్యాపారశ్రమ పెరుగుట. బంధు ఆదములు పెరుగుట సంభవించగలరు. దూరదేశ ప్రయాణములు కలుగుతాయి. యత్న కార్యములు జయమగును. బుద్ధి చాంచల్యము అధికము. ఉద్యోగ ప్రమోషన్స్ ఆలోచనలు వస్తాయి. కొన్ని సార్ధకత గల్గును. ఇష్ట దేవతా పూజలు చేయుము.


జూన్: ఈ నెలయందు అధికారుల ప్రశంసలు కలుగును. వృత్తిలో ధన లాభాదులు వచ్చును. ఋణములు తీర్చెదరు. గౌరవ భంగము, వృత్తియందు సామాన్య ధనలాభాదులు కలుగును. హృదయ సంకటములు జనించును. మనోవేదన అధికము. బంధుమిత్ర సుఖజీవనములు కలుగుతాయి. విదేశీ బంధువులు ఆత్మీయంగా పలికెదరు. ధార్మిక చింతనలు అధికము. దుర్గా పూజలు చేయుట మంచిది.


జూలై: ఈ నెలయందు ప్రయాణములలో శారీరక బాధలు, దుర్మార్గులదుశ్చేష్టలు | కవ్వించును. శారీరక ఆందోళనలతో ఆరోగ్యము దెబ్బ తినును. వృత్తి ఉద్యోగ | వ్యాపార వ్యవహారములు రాణించకపోవచ్చును. మిశ్రమ స్పందనతో సంచారములు చేస్తారు. స్త్రీ మిత్రత్వము ధనము నిచ్చును. స్త్రీలతో పుణ్య దేవాలయములకు వెళ్ళి పూజలు చేయుట మంచిది. శుక్రవారము లందు గోవులను పూజించండి.


ఆగష్టు : ఈ నెలయందు కొద్దిగా ఆరోగ్యము మార్పు రావచ్చును. మిశ్రమాదా యము సంభవించును. ఆదాయమునకు తీసిన ఖర్చు మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు మిశ్రమముగా ఆదాయము లభించును. గురు వారములందు రామాలయమునకు వెళ్లి దేవుని పూజించండి. రాజకీయ నిందలు వాదములు తరచు అన్ని వృత్తులవాళ్లకు వచ్చును. ఉద్యోగములందు సాటి అధికార గణముతో స్నేహము చేయుట మంచిది.


సెప్టెంబర్ : ఈ నెల ఆదాయమునకు లోటుండదు. సాంఘిక అభివృద్ధితో పయనించెదరు. వాహన యోగములు రావచ్చును. నెలమధ్య ఆరోగ్యలోపము రావచ్చును. ఇంటియందు వివాహ కార్యములు పూర్తి చేస్తారు. కుటుంబ పిల్లలకు ఉద్యోగములు రావచ్చును. పిల్లల భవిష్యత్తు అనుకూలము. గుమ్మడికాయ గుమ్మానికి కట్టిన జయము. ఆరోగ్యము కొద్దిగా మార్పు రావచ్చును.


అక్టోబర్ : ఈ నెల కుటుంబమునందు ఔషధసేవలు పెరుగును. ధన వ్యయము కలుగును. బంధు వైరములు అధికము. దాయాదుల ఆస్తి తగాదాలు రావచ్చును. ధనమునిఖచ్చిగానుంచుము. వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయరంగములవారికి సకాలములో ధనదాయము. మంగళవారము కుజుని పూజలు చేయండి. దీర్ఘకాలిక ఋణములు తీరును. కొత్త ఋణములు తెచ్చెదరు.


నవంబర్: ఈ నెల ఆదాయమునకు లోటుండదు. సాంఘిక అభివృద్ధితో పయనించెదరు. నెల మధ్యలో ఆరోగ్యలోపము వచ్చును. వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారములందు తగు జాగ్రత్తలు అవసరము. వాహన యోగము ఇబ్బందులు కల్గును. మిశ్రమదాయము. వృత్తియందు రాజ భయము వచ్చును. కుటుంబ సమస్యలు మిశ్రమము. వృధాగా ధన వ్యయములు చేస్తారు.

డిసెంబర్ : ఈ నెలయందు తలచిన పనులు నెరవేరును. ఉన్నత స్థితిని చేరుకుంటారు. అధికార గణం సూచనలతో సంచరించుట మంచిది. వ్యాపారస్థులకు ప్రభుత్వ బాధలు కొన్ని వస్తాయి. వృత్తి వాండ్లకు అనుకూలముగా యుంటారు. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. |ఆనందముగా గడుపుతారు. వస్తు వస్త్ర ఆభరణ లాభాలు ఉంటాయి. లక్ష్మీ పూజలు చేయుట మంచిది.

Related Rashi Phalalu:

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి, vruchika rasi in telugu 2021, vrischika rashi 2021 in telugu august, vruchika rasi in telugu june 202, vruchika rasi in telugu 2022 november, ఈరోజు వృచ్చిక రాశి ఫలితాలు, vruchika rasi in telugu today, 2022 వృశ్చిక రాశి ఫలితాలు, vruchika rasi in telugu 2022

Comments