2022 కన్యారాశి ఫలితములు
ఉత్తర 2,3,4 పాదములు హస్త 1,2,3,4పా॥ చిత్త 1,2 పాదములు
ఆదాయం 11
వ్యయం 5
రాజపూజ్యం 4
అవమానం 5
జనవరి : ఈ నెలయందు గ్రహసంచారము అనుకూలము. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు విశేష ధన లాభాదులు కలుగును. వ్యాపార సంస్థల వర్కర్లు బాధలు తప్పవు. ఇంటియందు కొంత ఆరోగ్య లోపము రావచ్చును. యాత్రలు చేయుట మంచిది. చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితములు పొందెదరు. కీర్తి. పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు చూచుట ముఖ్యము. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృత్తిరీత్యా సమస్యలు తొలగిపోతాయి.
ఫిబ్రవరి : ఈ నెలయందు వ్యవహారములు సవ్యంగా జరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార వృత్తులయదు సామాన్య ధన లాభాదులు కలుగుతాయి. ఆరోగ్యము బాగుగా యుండును. బంధు మరణాదులను వింటారు. పిల్లల చదువులను గూర్చి ధనవ్యయము చేస్తారు. పనిలో ఆటంకాలు తొలగుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. అప్పులు కొన్ని పొందుతారు.
మార్చి : మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవబలము రక్షిస్తుంది. వ్యాపారరీత్యా జాగ్రత్తలు అవసరము. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక నష్టాలు రావచ్చును. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆంజనేయస్వామి పూజలు చేయుట ముఖ్యము. అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించాలి. ఆరోగ్యము మీద జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.
ఏప్రియల్ : ఈ నెలయందు బంధుమిత్రులతో సమస్యలు ప్రారంభమవుతాయి. సామాజికంగా మంచి పనులను చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో స్పష్టత వస్తుంది. ఆస్థి వస్తువులు కొనుగోలు విషయంలో ప్రగతి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార వృత్తిరీత్యా సమస్యల్ని అధిగమిస్తారు.
మే : ఈ నెలయందు మీకున్న అవకాశములను పరిదులను గమనించి బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరములద్వారా కొత్త విషయాలు సేకరించెదరు. ఆర్థికంగా ఆభరణములను ఖరీదులను చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములనందు లాభదాయకంగా ఒప్పందాలు ఎగ్రిమెంట్స్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కలుగుతాయి.
జూన్: ఈ నెలయందు ఆత్మ విశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగములో...మీ మాటకు విలువ పెరుగుతుంది. మనస్సులోని కోరికలు ఫలిస్తాయి. వ్యాపారములు ఒడిదుడుకుగా ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. శ్రీరామ పూజలు అధికంగా చేయండి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం సాధిస్తారు. ఆరోగ్యమును గూర్చి తగు జాగ్రత్తలు పొందుట మంచిది.
జూలై : ఈ నెలయందు విద్యా వివాహ సమస్యలు అధికంగా వస్తాయి. పుత్ర పుత్రిక గోష్ఠి అధికము, కుటుంబ సౌఖ్యములు కలుగుతాయి. నీచులతో దుర్మార్గులతో కలహములు వస్తాయి. దేహబాధలు అధికము. స్థాన చలన యోగములు రావచ్చును. శతృబాధలు అధికము. వృత్తియందు శక్తి సామర్ధ్యములు | గుర్తింపు వస్తుంది.
ఆగష్టు : ఈ నెలయందు మీ వృత్తి వ్యాపారములందు ప్రత్యేకమైన సమాచారము పొందుతారు. వివాదములు మాట పట్టింపులు వదిలేస్తే మంచిది. ఆదాయాభి వృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించెదరు. అనుకోని ప్రయాణములు వస్తాయి. మీలో చాలాకాలంగా దాగియున్న కోర్కెలు సిద్ధిస్తాయి. బాల్య మిత్రులను కలసి గత చరిత్రలు మననం చేసుకుంటారు. కొంత దుఃఖములు చవిచూస్తారు.
సెప్టెంబర్: ఈ నెలయందు వృధా సంచారములు చేస్తారు. వాహన యోగము లభించును. పిల్లలకు విద్యా భంగ యోగము పట్టవచ్చును. ఉద్యోగమునందు ప్రమోషన్స్ రావచ్చును. వృత్తియందు లాభాదులు కల్గును. అధికార సందర్శనలు లభించును. బుద్ధి చాంచల్యము రావచ్చును. ఆందోళనములు అధికము. ఆకస్మిక కోర్టు వ్యవహారములు వస్తాయి.
అక్టోబర్ : ఈ నెలయందు గృహమునందు వివాహాది శుభకార్యములకు చర్చలకు వస్తాయి. కొన్ని వాహన ప్రమాదములు దర్శించెదరు. దేశాంతర ప్రయాణజనుల చర్చలు వస్తాయి. మానసిక ఆందోళనలతో సుఖ జీవనము చేస్తారు. వృధా సంచారములు చేస్తారు. స్త్రీ మూలక సమస్యలు ధనవ్యయము అధికమవుతాయి. సమస్యల పరిష్కారము కోసం స్నేహితుల కలయిక శుభదాయకము. కీర్తి లాభములు సామాన్య జీవనములు సహజముగా లభించును.
నవంబర్: ఈ నెలయందు వృత్తి వ్యాపార ఉద్యోగములందు కొత్త విషయాలు సేకరిస్తారు. ఇంటాబయటా మీ ప్రాబల్యము పెరుగుతుంది. అప్రమత్తంగా ఉంటారు. వ్యవహారాల్లో వచ్చే ఇబ్బందులు గమనించండి. ఉద్యోగములందు పదోన్నతులు కలుగుతాయి. శారీరక బాధలు ఉద్యోగ వృత్తి, ఋణ బాధలు పెరుగుతాయి.
డిశెంబర్: ఈ నెలయందు ప్రజా విరోధములు, దారిద్య్ర జనుల కలయిక సంభవించును. బంధుమిత్ర సమాగమము, ధనలాభము, ఇంటియందు భార్యతో సమస్యలు, పుట్టింటి సమస్యలు, సంతాన చర్చలు సాగుతాయి. వ్యవహార విజయాన్ని సాధించెదరు. వాహనయోగము రావచ్చును. దూర ప్రయాణములు చెరుపునిస్తాయి. ఋణముల బాధలు కొన్ని రావచ్చును. స్త్రీ మూలక సమస్యలు రావచ్చును.
Related Rashi Phalalu:
> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
కన్యారాశి, kanya rasi 2021 to 2022 telugu, kanya rasi phalalu 2022, కన్య రాశి వారి జాతకం 2022, kanya rashi 2022 telugu monthly, కన్య రాశి వారి జాతకం tomorrow, telugu rasi phalalu 2022 to 2023, kanya rasi phalalu november 2022, kanya rashi july 2022 telugu
Supurb
ReplyDelete