Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Karkataka Rasi 2022 - 2023 - Telugu Rashi Phalalu


2022 కర్కాటకరాశి ఫలితములు
పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదములు
ఆశ్లేష 1,2,3,4 పాదములు

ఆదాయం 5
వ్యయం 5
రాజపూజ్యం 2
అవమానం 5

జనవరి : ఈ నెలయందు మానసిక చింతయుండును. ధనవ్యయము, సంతాన సౌఖ్యము, స్త్రీజన వ్యయము. వ్యాపార శ్రమ ఉద్యోగములందు అవమానములు. వృధా వాదములు. ప్రజావిరోధములు ఋణాలు వచ్చును. శుభకార్య దర్శన యోగము, వివాహ సమస్యలు అతిగా బాధించును. ఆచితూచి అడుగు వేయుట మంచిది.

ఫిబ్రవరి : ఈ నెలదు అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. మనోబలము పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగ వృత్తులందు ధైర్యముగా ముందుకు వెళ్ళి ధనలాభాదులు పొందగలరు. లావాదేవీల్లో తెలివితో జాగ్రత్త వహించండి. వ్యవహారములు అనుకూలము. కోర్టు సమస్యలు కొన్ని విజయాన్ని ఇస్తాయి. నమ్మకముతో ముందుకు సాగండి.

మార్చి : ఈ నెలయందు సంకల్పసిద్ధియున్నది. ఆస్థి కొనుగోలు చేయవచ్చు. అప్పులు కొన్ని చేస్తారు. భయం లేకుండా ముందుకు వెళ్ళండి. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ప్రతి విషయమునందునూ జాగ్రత్త అవసరము. ప్రగతి సాధిస్తారు. తగిన ఆదాయము వస్తుంది.


ఏప్రియల్ : ఈ నెలయందు మీ ప్రయత్నములకు దైవత్వము సహాయము ఉంది. గ్రహస్థిత అనుకూలము. తలచిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న శరీర బాధలు రావచ్చును. ఆరోగ్యము మందగించును. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము బాగుగా యున్నాయి. ప్రభుత్వ సమస్యలు అధికము. దుష్టులకలయిక రావచ్చును. వ్యాపార ఉద్యోగ బంధు విషయాలు. అనుకూలముగా యుంటాయి.


మే : ఈ నెలయందు స్త్రీ మూలక వాదములు వస్తాయి. మానసిక భయము వస్తుంది. శరీర పట్టుత్వము తగ్గును. వ్యాపారము అనుకూలము. ఉద్యోగము అందు శ్రమ అధికము. చిలిపి చేష్టలు ఉద్యోగమునందు రావచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. యాత్రలు కుటుంబముతో చేస్తారు. ఆనందాన్ని పొందుతారు. పుత్రపుత్రికలగోష్టి ఆలోచనలు అతిగాయుండును.


జూన్ : ఈ నెలయందు బాధ్యతలు వ్యవహారములు పెరుగుతాయి. ధైర్యముగా యుండి ఉత్తమ ఫలితములు సాధించండి. వృత్తిరీత్యా సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయములందు స్థానచలనములు కలుగవచ్చును. అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. మనోబలముతో ముందుకు సాగండి. సాంప్రదాయములు పాటించండి.


జూలై : ఈ నెలయందు ఉత్సాహముగా పనిచేసి లాభాదులు సాధించండి. వృత్తి ఉద్యోగములందు తగు జాగ్రత్త అవసరము. ఆర్ధిక పుష్టికి మంచి సమయము. ఆత్మ విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగండి. పనులు అన్నియునూ ఆటంకము లేకుండా పూర్తియగును. చేయని తప్పునకు నిందారో పణములు వస్తాయి.

ఆగష్టు : ఈ నెలయందు వ్యాపారరీత్యా జాగ్రత్తలు అవసరము. ఉద్యోగమునందు పై అధికారుల సమస్యలు రావచ్చును. మనోబలముతో విజయం సాధించండి. చంచల స్వభావాన్ని తొలగించు కోవాలి. దైర్యంగా వ్యవహరిస్తే పనులు పూర్తిచేస్తారు. నిర్ణయాలు అతిగా ఆలోచించండి. అన్ని రంగాలవాళ్ళు సుఖంగా ఈ నెల అనుభవించెదరు.


సెప్టెంబర్ : ఈ నెలయందు వ్యాపార వృత్తి ఉద్యోగములందు అనుకూల ధనలాభములు, తలచిన పనులు పూర్తి చేస్తారు. కీర్తి సంఘ గౌరవము కలుగుతుంది. ఆందోళనలు తగ్గును. వృధా ధన వ్యయము చేస్తారు. భార్య పిల్లలు అనురాగంగా యుంటారు. చదువును గూర్చి జాగ్రత్తలు అవసరము. 


అక్టోబర్ : ఈ నెలయందు కొన్ని ఋణములు చేస్తారు. కొన్ని వస్తువులు ఆభరణములు ఖరీదు చేస్తారు. కుటుంబము ఆనందముగా ఉంటుంది. | వ్యాపారమునందు లాభము. వృధా ప్రయాణములు చేస్తారు. వృత్తియందు సామాన్య ఫలము వచ్చును. వ్యవసాయాదులు అనుకూలము కాదు. వ్యవహారములు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి పూజలు చేయండి. ఆరోగ్యము బాగుగాయుండును.


నవంబర్ : ఈ నెలయందు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కలుగుతుంది. ప్రతిభకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా కొత్త విషయాలు సేకరిస్తారు. మనఃస్థైర్యముతో ముందుకు సాగండి. మాట పట్టింపులకు తావు ఇవ్వవద్దు.. ఈ నేల్ బుధ, గురు, శుక్రవారములందు వినోదాల్లో సంచరిస్తారు. ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గును.

డిసెంబర్ : ఈ నెలయందు ఆశించిన సహాయము అందక పోవచ్చును. స్త్రీలు పిల్లల అభిప్రాయాలు బాగుగానుంటాయి. వ్యవహారములు అనుకూలమే. వ్యాపారాలు మందంగానుంటాయి. తాత్కాలిక అవరోధాలు దాటగలరు. వాహనయోగము బాగుగాయున్నది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళగలరు. ఉత్సాహంగా పనిచేస్తారు.

Related Rashi Phalalu:

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి, cancer career horoscope 2022, cancer astrology, cancer horoscope today, Karkataka Rasi 2022, 2022 Karkataka Rasi Phalalu

Comments