Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కుంభరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Kumbha Rasi Phalalu 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 కుంభరాశి ఫలితములు

ధనిష్ట 3,4 పాదములు శతభిషం 1,2,3,4 పాదములు 1,2,3 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదములు 

ఆదాయం 5

వ్యయం 2 

రాజపూజ్యం 5

అవమానం 4

జనవరి : ఈ నెలయందు ఇంటిలో సంతోషదాయకంగా ఉంటారు. అప్పులనుండి తొలగుతారు. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటూ ఆనందముగా నుంటారు. కొన్ని వివాదములనుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. మధ్యలో ఆస్థి వివాదాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ నేలయందు ఉత్తరదిశ ప్రయాణములు బాధిస్తాయి. ఇష్టదేవతలను ప్రార్ధించేంది.


ఫిబ్రవరి : ఈ నెలయందు ఆర్థిక లావాదేవీ సంతోషాన్నిస్తాయి. వ్యాపారముల విస్తరణపై దృష్టి పెడతారు. నేర్పుతో ఓరుతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో సమర్థత చాటుకుంటారు. స్నేహితులతో విబేధాలు వస్తాయి. గులాబి రంగు వస్త్రాలు ధరించండి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించవచ్చును. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కొన్ని ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.


మార్చి : ఈ నెలయందు కొన్ని ఇబ్బందులు పడుదురు. ఆకస్మికంగా దూర ప్రయాణములు చేస్తారు. వాహన యోగము లభిస్తుంది. శత్రుబాధలు కొన్ని. తగును. యాక్సిడెంట్స్ చూస్తారు. బాధలు అనుభవిస్తారు. గృహమునందు చికాకులు వస్తాయి. పిల్లలు దారితప్పి సంచరించవచ్చును. ఇష్టమైన దేవతల పూజలు చేయండి.


ఏప్రిల్ : ఈ నెలయందు మిశ్రమ గ్రహస్థితి దైవ భక్తితో కార్యాలు సాధించుట ముఖ్యము. మానసిక స్థితిలో ఇబ్బందులన్నా ప్రముఖుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగములందు కొంత ఆర్థిక బలం పుంజుకుంటుంది. వృత్తివారలకు ఋణములు లభించును. విద్యార్థులు ఉత్తీర్ణతలు పొందెదరు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకముగా యుంటుంది. ప్రయత్నపూర్వక పనులు రాణించును.


మే : ఈ నెలయందు గ్రహస్థితి అనుకూలము. బంధు సహకారములు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు ఊరటనిస్తాయి. మాసాంతంలో అసహన సంచారము. యువత బాధలు చూస్తారు. విద్య వ్యాపారంలో ఇబ్బందులు. సీటు విషయ చర్చలు జరుగుతాయి. బిడ్డల చదువులు ఆనందాన్నిస్తాయి. శారీరక బలహీనతలు రావచ్చును. మాట పట్టింపులు అధికము. పిల్లలు దారి తప్పే అవకాశములున్నాయి.


జూన్ : ఈ నెల ఆర్థిక వ్యవహారములు మెరుగుపడును. రావల్సిన బాకీలు వచ్చును. ఋణములు తీర్చేదరు. వివాహ ఉద్యోగ ప్రయత్నములు రాణించును. స్పందనలు కన్పట్టును. ప్రయాణములు అధికము. కొన్ని ఆటంకములు వస్తాయి. వేంకటేశ్వర ప్రసాద వితరణ చేసినచో కొన్ని బాధలు తీరును. కుజ గ్రహ పూజలు చేయుటమంచిది. ధనయోగము లభించును. ఋణబాధ, కోర్టుబాధలు తొలగును.

జూలై: ఈ నెలయందు ఓర్పుతో వివాదములు సమసిపోతాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. స్థిరాస్థి వృద్ధి కలుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగములో చిక్కులు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆశలు కల్గును. అనారోగ్యము శాంతించును. దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానములు వస్తాయి. మధ్యలో ఆస్థి వివాదములు వస్తాయి. అనుకోని శుభాలు కలుగుతాయి.


ఆగష్టు : ఈ నెలయందు ఆర్థిక సమస్యలు అనుకూలము. రావల్సిన బాకీలు వస్తాయి. దూరపు ప్రాంత బంధవులు వస్తారు. ఆత్మీయుల సూచనలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగములో తెలియని ఒప్పందాలు వస్తాయి. ధైర్యంగా రక్షిస్తుంది. సహచర్య మిత్రత్వముతో ముందుకు సాగండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. శక్తివంచనలేని ప్రజలు మిత్రులుగా లభించగలరు. ఆర్థికస్థితిలో జాగ్రత్తలు అవసరము.


సెప్టెంబర్: ఈ నెల ఆర్ధిక నష్టాలు రావచ్చును. అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిం చాలి. చిన్న పొరపాట్లు సర్దుకోండి. చింతించి ప్రయోజనము లేదు. కార్యశూరత సాధించుట ముఖ్యము. లావాదేవీల్లో అనుకూలము. క్రయ విక్రయ విధులు నిర్వహించగలరు. అభివృద్ధి అంశాల్లో స్పష్టత వస్తుంది. పెద్దల వద్ద వినమ్రతతో | వ్యవహరిస్తూ వారి ఆదరాభిమానాలతో ముందుకు సాగండి. వృత్తి వ్యాపారోద్యో గులతో అనుకూల ధనప్రాప్తి కలుగును.


అక్టోబర్ : ఈ నెలయందు ఆస్థి ఆభరణములు, ఖరీదులు చేయగలరు. స్త్రీలకు ఆనందాన్ని ఇస్తారు. పిల్లల కోర్కెలు తీర్చలేరు. జీవిత సమస్యలు బాధించును. అభివృద్ధి అంశాలు బాగుగా యుండును. మనోబలము విజయం సాధిస్తాయి. దుర్గాధానము మేలు చేకూరుతుంది. కీర్తి పెరుగుతుంది. మధ్యలో ధనవ్యయము కల్గును. ఆరోగ్య విషయాలు బాధనిస్తాయి.


నవంబర్ : ఈ నెలయందు ప్రయత్నబలము పెరుగును. ఉత్సాహముతో పనులు పూర్తి చేయండి. నిరుత్సాహము వద్దు. దైవశక్తి కాపాడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది. బంగారు జీవితాన్ని పొందుతారు. అంతా అనుకున్న విధంగా కార్యాలు సాధిస్తారు. వాహన యోగము అందు జాగ్రత్తలు పొందుట ముఖ్యము. నెలంతము మంచి వార్తలను వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము.

డిశెంబర్ : ఈ నెలయందు మీ మాటకు విలువ పెరుగుతుంది. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఆస్థి సమస్యలు పరిష్కారము చేసుకొనుట ముఖ్యము. బంధుమిత్రుల ఆనందము వల్ల కొన్న బాధలు తీరును. అప్పులు తీరును. కొత్త ఋణాలు చేస్తారు. అవరోధములు తొలగుతాయి. అదృష్ట యోగము సామాన్య ముగా ఉంటుంది. సమయ స్ఫూర్తితో ప్రతి పని సాధించగలరు. నవగ్రహపూజ చేయండి.

Related Rashi Phalalu:

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభరాశి, kumbha rasi phalalu today, kumbha rasi phalalu 2021 to 2022, kumbha rasi 2021 to 2022 telugu, today kumbha rasi in telugu, kumbha rasi today, tomorrow kumbha rasi in telugu, kumbha rasi phalalu tomorrow, రేపటి రాశి ఫలాలు కావాలి

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు