2022 మకరరాశి ఫలితములు
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు శ్రవణం 1,2,3,4 పాదములు
ధనిష్ట 1,2 పాదములు
ఆదాయం 5
వ్యయం 2
రాజపూజ్యం 2
అవమానం 4
జనవరి: ఈ నెలయందు ఓరుతో కొన్ని వివాదములు పరిష్కరించెదరు. ఆర్థిక స్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్థి వివాదములందు జాగ్రత్త వహించాలి. సన్నిహితులు సహాయము చేస్తారు. వాహన కొనుగోలు ఆలోచన వస్తుంది. పారిశ్రామిక వర్గాలు ఆనందముతో ఉంటాయి. దక్షిణ దిశ యాత్ర అనుకూలిం చును. మాసమధ్యలో ఇంట్లో అనారోగ్యములు బాధించును. బంధువులనుండి ఆహ్వాన ములు అందుతాయి. లక్ష్మీనరసింహ పూజలు చేయగలరు.
ఫిబ్రవరి : ఈ నెలయందు దూరప్రాంతమునందు మిత్రుల ఆహ్వానించెదరు. ఇంటిలో సంతోషదాయ కంగా ఉంటుంది. ఆప్తులనుండి ధనలాభం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుగానుంటాయి. ఓర్పుతో పని చేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో అనుకూలము. ధనయోగములు ఉన్నాయి. ఇంటి యందు ఆరోగ్య విషయాల్లో ఆందోళనలు అతిగానుంటాయి. శనిపూజ చేయుట మంచిది.
మార్చి : ఈ నెలయందు మీ అనుభవమే మిమ్ములను బలపరుస్తుంది. దైవ బలము రక్షించును. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తియగును. రావల్సిన బాకీలు వస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. లావాదేవీల్లో తెలివిగా మారండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక వసతులు మెరుగుగా ఉండవచ్చును. ఇంటి ఆరోగ్యములు కొన్ని బాధిస్తాయి. గణపతి, సూర్యస్తోత్రాలు చదువుట మంచిది.
ఏప్రియల్ : ఈ నెలయందు వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ప్రత్యేకత చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యపనులు విజయవంతం అగును. యాత్రలు చేస్తారు. వాహనములు, ఆభరణములు ఖరీదు చేస్తారు. స్త్రీల ఆభరణములవద్ద చికాకులు వస్తాయి. ఈ నెలయందు పశ్చిమ దిశ ప్రయాణం రాణించును. ఆరోగ్య విషయము శాంతించును.
మే:ఈ నెలయందు దూరపు బంధువల ఆహ్వానములు వస్తాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అదృష్టయోగము విశేషంగా యుంది. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించండి. కోరుకున్న పనులు జరుగును. ఆర్థిక లావాదేవీలతో ఆందోళనలు వద్దు. ఇష్టదైవ స్మరణ శుభప్రదము. వృత్తి ఉద్యోగాల్లో పైకి వస్తారు. స్వల్ప ప్రయత్నములు రాణించును. భారీ ప్రయత్నములు ఆలోచించాలి. అన్నింటి యందునూ ఆందోళనలు స్తాయి.
జూన్: ఈ నెలయందు మంచి కాలము నడుస్తుంది. చిత్తశుద్ధితో పనులు |చేయండి. ఉద్యోగంలో శ్రమయున్నా శాంతిని పొందుట మంచిది. కార్య శూరత అన్నిచోట్ల పనిచేయదు. మానసికంగా దృఢంగా స్థిరంగా ప్రతి పనియందునూ ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న ధనాన్ని సాధిస్తారు. లాభాదులు అనుకూలిస్తాయి.
జూలై : ఈ నెలయందు ఆరోగ్యములో కొద్ది మార్పులు రావచ్చును. మిశ్రమాదా యము. ఆదాయము కష్టముగా వచ్చును. శ్రమించుట ముఖ్యము, వృత్తియందు చీటికి మాటికి ఇబ్బందులు ధనరూపంగా రావచ్చును. ఆరోగ్యము వేధింపు చర్యగానుంటుంది. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో వృత్తుల్లో వర్కర్సు ప్రాబ్లం వస్తుంది. స్వంతంగా తన పని తాను చేసుకొనుట మంచిది.
ఆగష్టు : ఈ నెలయందు ఆరోగ్యము బాగుండును. స్త్రీ సౌఖ్యము, మాట పట్టింపులు తొలగును. శారీరక శ్రమ తగ్గును. ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. వాహనయోగము, శారీరక పోకడలు తగ్గించాలి. వృత్తి వ్యాపార, రాజకీయ వ్యవహార జయములు అధికము. స్త్రీలతో పుణ్య దేవాలయములు సంచారము మంచిది. ఋణ బాధలు శాంతించును.
సెప్టెంబర్: ఈ నెల అన్నిరంగాలవారికి ధనదాయము మిశ్రమము. తలచిన పనులు నెరవేరును. ఆరోగ్యం కొద్దిగా మార్పు వచ్చును. ముఖ్యకార్యాల్లో అవకాశములు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగములందు శ్రమకు తగ్గ ఫలితము వస్తుంది. దుర్మార్గులతో స్నేహము విడిచి సన్మార్గుల స్నేహము మంచిది. స్త్రీ మిత్రత్వము చేటుతెస్తోంది. గోవు పూజ ఒకసారి చేయండి.
అక్టోబర్ : ఈ నెలయందు కొత్త పనులు చేపట్టి ఆర్థిక పురోగతి పొందుతారు. లాభాదులు అనుకూలము. ఆత్మీయులనుండి శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. శ్రేయోభిలాషులనుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో నూతనోత్సవాలు ఉంటాయి. ఈ నెలయందు మహిళా సంయోగము బాధించును. ఋణములు కొన్ని తీర్చెదరు.
నవంబర్: ఈ నెలయందు ఆదాయము వచ్చిననూ మంచినీళ్ళవలె ఖర్చు చేస్తారు. మానసిక ఆందోళనలు రావు, అన్నదమ్ముల సహాయ సహకారములు లభించును. భార్యాబిడ్డల సమస్యలు తీరును. ఇంటియందు ఉద్యోగప్రాప్తి కల్గును. బంధుమిత్రులు అభినందనలు తరచుగా వచ్చును. స్త్రీలకు గర్భదోష వ్యాధులు. తొలగును. భయాందోళనలు తగ్గును.
డిశెంబర్: ఈ నెలయందు చేయు వృత్తి వ్యాపారములు అనుకూలతలు ధనాదాయము బాగుగా యుండును. బంధువర్గములో బాధలు అధికము. బంధువులు అప్పులకొరకు వచ్చెదరు. వారి కోపాలు మిమ్ములను ఇబ్బంది పెట్టును. ప్రయాణ పుణ్యక్షేత్రములు ఆనందాన్ని ఇస్తాయి. మనో సంకల్పము తొలగును. బంధుమరణ వార్తలు వింటారు. ఉద్యోగము సాఫీగా చేయగలరు.
Related Rashi Phalalu:
> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
మకరరాశి, మకరరాశి ఫలాలు 2022, Makara Rasi, Makara Rasi 2022-2023 Yearly Prediction, Capricorn Horoscope 2022, Makara Rasi - Mulugu Panchangam,
Comments
Post a Comment