2022 మీనరాశి ఫలితములు
పూర్వాభాద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు
ఆదాయం 2
వ్యయం 8
రాజపూజ్యం 1
అవమానం 7
జనవరి : ఈ నెలయందు ఋణములు తీర్చెదరు. రావల్సిన ధనము వచ్చును. ఖర్చులు పెరుగును. బంధుమరణ చింతలు అధికము. ఉద్యోగ వృత్తులందు మిశ్రమాదాయములు వస్తాయి. తృప్తితో జీవించుము. వ్యాపార సాహవాసము చేయవద్దు. స్త్రీ వాదములు పెడచెవి పెట్టండి. సంతాన సమస్యలు -వచ్చును. కుటుంబ కార్యాలు పూర్తి చేస్తారు. పిల్లల చదువులగూర్చి శ్రమించెదరు. -దూర ప్రయాణములు చేస్తారు.
ఫిబ్రవరి : ఈ నెలయందు గ్రహములు అనుకూలము. ధనవ్యయము, జాగ్రత్తలు పొందుట ముఖ్యము. వ్యవహార చిక్కులు వచ్చినా భయము వలదు. కార్యం అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక తనిఖీలు వ్యాపారమునందు వస్తాయి. బంధువులు అనుకూలిస్తాయి. శని ప్రభావముచే కొంత ఆరోగ్యస్థితి మందగించును. వ్యవహారములందు ఆదాయ వ్యయములు, సమయము, రావల్సిన బాకీలు వస్తాయి.
మార్చి : ఈ నెలయందు ఆరోగ్యము బాగుగాయుండును. స్త్రీ సౌఖ్యము, మాట పట్టింపులు తొలగించుము. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు. మిశ్రమ స్పందన వస్తుంది. అన్నియునూ అనుకూలమే. యాత్రలు చేస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయ వ్యయాలు సమానంగానుంటాయి. క్రయ విక్రములందు జాగ్రత్తను పాటించుట ముఖ్యము..
ఏప్రియల్ : ఈ నెలయందు చెప్పుకోదగ్గ మార్పులు లేవు. వ్యాపారము సాఫీగా జరుగును. వృత్తియందు ధనాదాయము. పొగడ్తలకు లొంగవద్దు. ఆందోళనలు బాధించవు. పిల్లలు భవిష్యత్తు అనుకూలము. స్వాములకు మొక్కులు తీర్చండి. వ్యాపారములందు ఆర్ధిక స్థితిగతులు విచారించాలి. కీర్తి గౌరవాలు వృత్తియందు లభిస్తాయి. పిల్లల వివాహములు విచిత్రముగా జరుగుతాయి. అన్యకుల సాహవాసము నందు పిల్లల భవిష్యత్తు చూచుట ముఖ్యము.
మే : ఈ నెలయందు కోపస్వభావముతో కార్యములు చేస్తారు. ఉద్యోగములందు సరియైన పద్ధతి లోపించును. వ్యాపారము అధికారులతో నుంటుంది. వృత్తి పనులు సామాన్యముగానుంటాయి. వ్యవహార చిక్కులు వస్తాయి. శారీరక మానసిక బాధలు వస్తాయి. సాహసించి పనులు పూర్తి చేస్తారు. స్త్రీ వాక్యములను పాటించు ముఖ్యము. నరదృష్టి దోషాలు, బాధలు కొన్ని వేస్తాయి.
జూన్ : ఈ నెలయందు పిల్లల భవిష్యత్తు అనుకూలము. వివాహాది విషయములు చర్చకు వస్తాయి. వృత్తి వ్యాపారములు ధనాదాయము సామాన్యము. అశాంతి కార్యములు సాధిస్తారు. దేవీ పూజ తప్పక ఆచరించండి. గౌరవములు వస్తుయున్నా అసూయలు అధికముగానుంటాయి. వ్యవహాము లందు ఆదాయ వ్యయములు అనుకూలంగానుంటాయి.
జూలై : ఈ నెలయందు సమస్యలు వస్తాయి. ధనవ్యయం చేస్తారు. పుత్రపుత్రికల కార్యాలు పూర్తి చేస్తారు. శారీరక, మానసిక వ్యాధులు ప్రబలును. వాహన యోగ్యత వచ్చును. కుటుంబ బంధువర్గ మైత్రి అనుకూలము. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో మంచి వ్యాపారములు వచ్చినా ధనము సాధించుట యందు వివేలము అగుదురు. వ్యవహార చిక్కులు వస్తాయి.
ఆగష్టు : ఈ నెలయందు ఆరోగ్యములో కొద్దిగా మార్పు రావచ్చును. మిశ్రమా దాయము వచ్చును. ఆదాయము కష్టమ ఖర్చు పెట్టుట మంచిది. ధనమును అప్పులుగా ఇవ్వవద్దు. ఇంటి అద్దెలు అధికము. స్థానచలనములు వస్తాయి. ఆర్ధికంగా అనుకూలంగాయున్నా సమస్యలు వెంటాడుతాయి. సౌఖ్యము కలదు. భార్యాబిడ్డలతో శుక్రవారములందు పూజలు చేయుట మంచిది.
సెప్టెంబర్: ఈ నెల ఆరోగ్యము బాగుగా యుండును. స్త్రీ సౌఖ్యము లభించును. మాట పట్టింపులు వస్తాయి. అన్ని రంగముల వారికి ధనాదాయము పెరుగుతుంది. అధిక ఖర్చులకుదూరంగా యుండుట మంచిది. నీచులతో స్నేహము వద్దు. ఆరోగ్యము కుదురుగా యుండును. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములు ఆర్ధిక పుష్టిగా యుండును.
అక్టోబర్ : ఈ నెలయందు మనోబలం మిమ్ములను కాపాడుతుంది. ప్రతి | అడుగునూ జాగ్రత్తగా వేయాలి. లోపాలు వెతికేవారు ఉండవచ్చు. ఆ లోపములు మనకు జీవనం కావు. ప్రతి పనియందూ శక్తివంచన లేకుండా ప్రయత్నించండి. శాంతచిత్తంతో ఆలోచించి పనులు చేయండి. అధికారులతో సామరస్యముగా మెలగండి. ఆదిత్య హృదయం చదవండి. ఆరోగ్యముపై శ్రద్ధ పెంచండి. అపార్థాలకు తావివ్వకండి. బుద్ధి బలముతో అధిగమించండి.
నవంబర్: ఈ నైలయందు సంకల్పసిద్ధి యుంటుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ధర్మమార్గంలో పయనించండి. 'మనోబలము మిమ్ములను కాపాడి రుణసమస్యలు బాధించును. సామరస్యముగా వ్యవహరించండి. తగాదాలకు దూరంగా యుండండి. విశిష్టమైన కార్యసిద్ధికి అవకాశము ఉన్నది. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగుట మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ నెలయందు ధన లాభాదులు బాగుగా యుండును.
డిసెంబర్: ఈ నెలయందు దూరపుప్రాంతాల ముఖ్య సమాచారములు వస్తాయి. బాంధవ్య విషయ చర్చలు జరుగుతాయి. వివాహ విషయ చర్చలు రావచ్చును. | దూరపు వ్యాపారులు వస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు అనుకూలముగా ధనలాభాదులు సాగుతాయి. అన్నియునూ అనుకూలముగా నుంటాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగము లభించును.
Related Rasi Phalalu:
> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
మీనా రాశి, 2022 Meena Rasi Phalalu, Horoscope Meena Raasi, 2022 రాశి ఫలాలు, telugu rasi phalalu 2022 to 2023, Meena Rasi, Meena Rasi Phalalu January 2022 Telugu, శ్రీ శుభకృతు నామ సంవత్సరం.
Comments
Post a Comment