2022 మేషరాశి ఫలితములు
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయం 14
వ్యయం 14
అవమానం 6
రాజపూజ్యం 3
జనవరి : ఈ నెలయందు గ్రహములబలముచే ఆరోగ్యము బాగుగా యుండును. విద్యావ్యాపార ఉద్యోగ పదవులందు అభివృద్ధితో ధనముతో యుందురు. చిన్న చిన్న వైరములు కూడ రావచ్చును. ధనయోగముచే కొన్నిసార్లు ఇబ్బందులు అనుభవిస్తారు. పాత బాకీలు కొన్ని తీర్చగలరు.
ఫిబ్రవరి : ఈ నెలయందు దురాశతో చేసే పనులు వికటిస్తాయి. వృత్తియందు కలతలు పొందుతారు. భార్యాభర్తల ఆనందముతో యుండుట మంచిది. పాత బాకీలు కొన్ని తీర్చెదరు. ప్రయాణములు తగ్గించుట మంచిది. ఇంటి యందు నేత్ర బాధలు వస్తాయి. ఉద్యోగములందు ధనాదాయము బాగుగాయుండును.
మార్చి: ఈ నెలయందు ఆర్థిక లావాదేవీలు అనుకూలము. దూరప్రయాణములు చేస్తారు. ప్రణాళిక ప్రకారము నడచుట మంచిది. ఇంటియందు చికాకులు రావచ్చును. ఈ నెలయందు కొంచెము రుణములు చేయవచ్చును. విలువైన ఖరీదులు చేస్తారు. కొన్ని నష్టములు కూడా రావచ్చును. వృత్తి వ్యాపారాదులందు ఆలోచనలు అధికము. స్థిరాస్థి వలన సమస్యలు అధికము.
ఏప్రియల్ : ఈ నెలయందు ఉద్యోగములో ఉన్నత స్థితి ఉంటుంది. వ్యాపారములో అధిక లాభాలు వస్తాయి. మిత్రులతో కలసి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కుటుంబ సభ్యులమేలు అనుకూలము. గృహ భూ వాహన యోగములున్నాయి. ఇష్ట దేవతను స్మరించండి. వ్యాపార ఉద్యోగ వృత్తి సామాన్యజనుల బాధలు కొన్ని తొలగిపోగలవు.
మే: ఈ మాసమందు సామాన్య ధనప్రాప్తి. కొన్ని విషయములు అనుకూలము. కొన్ని వ్యవహారములు వేధించును. బంధు జన మృతులు అధికము. తరచు ప్రయాణములు చేస్తారు. పిల్లల వివాహబంధములు, చదువులు కొన్ని ఇబ్బందులు చేస్తాయి. సామాన్య యోగము ఈ నెలయందు జీవితము నడుచును.
జూన్ : ఈ నెలయందు ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది. దైవ నిర్ణయాలు తీసి కార్యక్రమములు ప్రారంభించండి. వృత్తియందు వ్యాపారమునందు చేతి వృత్తుల యందు కొంచెము వడిదుడుగ్గా పనులు జరుగుతాయి. ప్రయత్న బలాన్ని బట్టి మీ పనులు సాగుతాయి. పట్టువిడుపులు అవసరము. ప్రశాంత జీవనము లభిస్తుంది.
జూలై : ఈ నెలయందు గ్రహస్థితి అనుకూలము. రాజకీయ వ్యహారములు జయము. వృత్తి ఉద్యోగములందు సంతృప్తి కలుగును. స్త్రీ మూలకంగా కలహములు వచ్చును. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్థాయి. అదృష్టకాలము నడుస్తుంది. పెద్దల సహకారము అందుతుంది. ఈ నేలయందు లక్ష్మీ స్తుతి మేలునిచ్చును. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు చేయగలరు. వ్యాపారబలము గాయున్నది. జాగ్రత్త వహించుట మంచిది.
ఆగష్టు : ఈ నెలయందు శుభకాలమే కొన్ని పనులు ఆటంకములు వస్తాయి. పిల్లల చదువులు అనుకూలము. అన్ని పనులూ సాగిపోతాయి. ధనము కొరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొహమాటము ప్రక్కకు పెట్టి కార్యదీక్షతో ముందుకు సాగుము. రామనామం జపము ముఖ్యము. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు తగిన లాభాదులు పొందగలరు. ఆరోగ్యము బాగుగా యుండును. పెద్దల ఆరోగ్యము తరచుగా బాధించును. ధనవ్యయము అధికముగా చేయగలరు.
సెప్టెంబర్: ఈ నెలయందు ప్రతి పనిని కూడా ఆలోచించి చేయండి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురు వస్తాయి. తోటివారి సహాయము అనుకూలము. మిత్రుల సహాయముతో ధనాన్ని సేకరిస్తారు. గృహలాభ యోగములు ఉన్నాయి. ఉద్యోగరీత్యా తగు జాగ్రత్తలు అవసరము. దూర ప్రయాణములు చేస్తారు.
అక్టోబర్ : ఈ నెలయందు ప్రతి వ్యవహారమునందు సత్ఫలితము కలుగును. గా కొంత మేలు లభించును. అసలు ధనము వస్తుంది. రావలసిన బాకీలు వస్తాయి. దగ్గరివారితో విరోధములు వస్తాయి. అందుచే శ్రీ వెంకటేశ్వర గుడికి వెళ్ళి ప్రదక్షణములు గాయించి సంతృప్తి పొందండి. ఇంటియందు భార్యా పిల్లలు ఆనందముగా ఉంటారు. ధనము వృత్తియందు ఉద్యోగములందునూ చేతివృత్తులందు బాగుగానే వస్తాయి. దూర ప్రయాణములు చేయుట మంచిది.
నవంబర్ : ఈ నెలయందు ఆర్థిక అంశాలు బాగుగా యున్నాయి. సంకల్పము సిద్ధి బాగాయున్నది. శ్రేష్ఠమైన ఫలితములు వస్తాయి. ఆరోగ్యము బాగుగా ఉంటుంది. ఉద్యోగములో ఉన్నత స్థితి గోచరిస్తోంది. పదవీ లాభాలు కొన్ని వస్తాయి. గురుధాన్యము చేయండి. విద్యా సంబంధిత పనులు పూర్తియై విజయము సాధించెదరు. కోర్టు మున్నగు వ్యాపారములు అనుకూలిస్తాయి. ఆరోగ్యము బాగుగా యుంటుంది. అనుకున్న ఋణములు వస్తాయి.
డిసెంబర్: ఈ నెలయందు ధనలాభముంది. కీర్తి పెరుగుతుంది. లక్ష్మసిద్ధి సాధించెదరు. ఉద్యోగపరంగా స్వల్ప శ్రమ తప్పదు. వారాంతములో శుభాలు వింటారు. పిల్లల చదువులు ఆనందాన్ని కల్గిస్తాయి. పిల్లల బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించుట వచ్చును. జీవిత సాఫల్యము ఆలోచించాలి. వృత్తి ఉద్యోగ పనులు సక్రమముగా నడచును.
Related Rashi Phalalu:
> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
మేషరాశి, Mesha Rasi today in telugu, Mesha Rasi 2022 to 2023 Teluguవృషభరాశి, Aries Horoscope 2022, Vrushaba Rasi in telugu, vrishabha rashi 2022 in english, vrishabha rashi 2022 in telugu, vrishabha rashi 2022 telugu, vrishabha rashi today, mithun rashi 2022, kanya rashi 2022, vrishchik rashi 2022, kumbh rashi 2022
Comments
Post a Comment