Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మిధునరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Mithuna Rasi 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 మిధునరాశి ఫలితములు

మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు

పునర్వసు 1,2,3 పాదములు

ఆదాయం 11

వ్యయం 5

రాజపూజ్యం 2

అవమానం 2

జనవరి : ఈ నెలయందు చేయు పనులచే బంధనము కల్గును. కొంచెము ఆలోచించి పనులు చేయుట నేర్పరితనము. మంచివారితో పనులను గూర్చి చర్చించుట మంచిది. శరీర రోగములు కలసిరావు. వ్యాకులతలు చెందగలరు. ఇతరుల సహాయముతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయములందు దూకుడుగా వెళ్ళక శాంతియుతముగా పనులు సాధించగలరు.


ఫిబ్రవరి : ఈ నెలయందు వృత్తి వ్యాపక విషయాలందు విజయం సాధిస్తారు. మంచి ఆదాయము పొందెదరు. ఆరోగ్యము మందగించును. తలపెట్టిన కార్యములు సామాన్య ఫలములనిచ్చును. జాయింటు రుణములు తీరుస్తారు. మితిమీరిన ఆలోచనలు వద్దు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చును. వ్యాపారులు అధికారులకు చిక్కును, కుటుంబ సమస్యలు కూడా వచ్చును.


మార్చి : ఈ నెలయందు వృత్తి ఉద్యోగ వ్యాపారములు అనుకూలము. రావల్సిన బాకీలు వచ్చును. జాయింటు రుణములు కొన్ని తీర్చెదరు. రావల్సిన ధనము చేతికందును. ఋణ సేకరణ ఉపయోగము. వ్యవహారములందు చురుకు దనము మంచిది. కోర్టు వ్యవహారములు రాణించును. ఆకస్మిక చికాకులు వస్తాయి. స్త్రీ సహాయముతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈర్ష్యలు అతిగా పుట్టును.


ఏప్రియల్: ఈ నెలయందు వాహన యోగమున్నది. శారీరక మానసిక సంతోషములు కలుగుతాయి. శుభకార్యానుకూలము. దుష్ట సాంగత్యము రిచేరి రావచ్చును. వృత్తియందు ధనలాభాదులు కలుగును. ఉద్యోగ వ్యాపారములందు స్థానచలనములు కలుగవచ్చును. బంధుమిత్ర దర్శనము సుఖవిందు వినోదాలు పొందుతారు. నీచులతో కలహములు వచ్చును. శాంతియుతంగా వ్యవహరించగలరు. ధార్మక చింతన బాగుండును.


మే: ఈ నెలయందు ధనార్దము వృధానంచారము. అన్వేషణ సమస్యలు అధికము. గృహసౌఖ్యము కలుగుతుంది. ఇంటి వ్యవహారములు పిల్లల వ్యవహారములు అనుకూలము. భాతృబంధు మరణాదులు అధికము. పుత్ర పుత్రిక విద్యాగోష్ఠి తగదు. వివాహాది సుఖప్రాప్తి కొన్ని సందర్భములందు కలుగవు. ధార్మిక చింతన మంచిది. లలితాదేవి పూజలు జాగ్రత్తగా నిర్వహించండి. లాభాదులు కలుగును. 


జూన్ : సాహిత్యాది సభలను దర్శించగలరు. కుటుంబ సమస్య పరిష్కారమగును. విందులు చేస్తారు. సోమరితనము మరచిపోగలరు. వృత్తియందు ధన ఋణములు లభించగలవు. స్థానచలనము రావచ్చును. మొండి బాకీలు వసూలు అగును. ఆకస్మిక కోర్టు వ్యవహారములు రావచ్చును. పుత్ర పుత్రికల మనోవేదనలు ఉంటాయి. కొన్ని సందర్భములందు కార్య విజయమునకు ఆటంకము రావచ్చును.

జూలై : ఈ నెలయందు దాంపత్య సుఖము అధికము. పిల్లల జీవితముల చర్చ వచ్చును. వృత్తి వ్యాపారములందు అనుకూల ధనము వచ్చును. ఆరోగ్యము బాగుగా యుండును. ఇంటి వ్యవహారములు చక్కపడును. ధార్మిక విషయములు అనుకూలము. వాహన, ఆభరణ యోగములు బాగుగా యుండును. కొన్ని కొత్త వస్తువులు ఖరీదు చేస్తారు. అనుకున్న చోటకు ప్రయాణము చేస్తారు. దైవ దర్శనమును పొందుతారు.


ఆగష్టు: ఈ నెలయందు ఆర్థిక అంశాలు శుభప్రదముగా ఉంటాయి. ఉద్యోగములో మంచి ఫలితము ఉన్నది. తలచిన కార్యములు పూర్తి చేస్తారు. పితృ సంబంధిత జనులు వ్యాధులతో బాధలు పొందుతారు. పట్టుదలతో పనులు నిర్వర్తించి విజయం సాధిస్తారు. తగిన సహాయములు మిత్రులచే రాణిస్తాయి. ఒత్తిడితో పనులు వేగంగా చేయగలరు. పెద్ద ఆటంకములు వచ్చిననూ లెక్కించరాదు. 


సెప్టెంబర్: ఈ నెలయందు మీ కోరికలు సిద్ధించును. ఉద్యోగములో శుభము చేకూరును. వృత్తియందు జాయింటు సమస్యలు అతిగా వస్తాయి. దూర ప్రయాణములు చేస్తారు. వాహన ప్రయాణములందు తగు జాగ్రత్తలు అవసరము. మనశ్శాంతికి భంగము కలిగించే వారున్నారు. పెద్ద ఇబ్బందులు ఏమియునూ ఉండవు. శ్రీ కాళహస్తి దేవుని దర్శించుకొనుట చాలా శుభములు పొందుతారు. 


అక్టోబర్ : ఈ నెలయందు ముఖ్య కార్యాల్లో విజయం చేకూరుతుంది. ఆర్థికాంశాలు శుభములు ఇస్తాయి. జీవితాశయము సిద్ధిస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదించెదరు. ఇంటియందు ఆరోగ్యలోపములు కొన్ని రావచ్చును. ధార్మికవృత్తి బాగుగా సాగుతుంది. అన్నికార్యాలు అనుకూల వాతావరణములోనుంటాయి.


నవంబర్ : ఈ నెలయందు ముఖ్య అంశాల్లో జాగ్రత్త వహించాలి. స్వల్ప ఆటంకాలు వస్తాయి, తొలగుతాయి. ఆరోగ్యాన్ని గూర్చి లోతుగా ఆలోచించవద్దు. మనస్సులో అనుకున్నది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేయాలని ఆలోచనలు అధికంగా కలుగుతాయి. ఇష్ట దేవతను ధ్యానించండి.

డిశెంబర్: ఈ నెలయందు ఆరోగ్యము బాగుండును. శ్రమతో కూడిన ప్రయాణము చేస్తారు. ఇష్టకార్యములు సత్ఫలితములు ఇస్తారు. బంధువర్గ బాధలు తప్పవు. ఆర్థిక అంశాలు బాగుగా యున్నాయి. విద్యాదులందు పిల్లలు అనుకూలము. ఇంటి గృహకార్యములతలంచుమవారు కొన్ని రోజులు

Related Rashi Phalalu:

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి వారి జాతకం 2022, mithun rashi 2022 predictions, mithun rashi 2022 in telugu, mithun rashi 2022 love life, mithun rashi 2022 january, mithun rashi 2022, mithun rashi 2022 in marathi, gemini horoscope 2022, tula rashi 2022

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు