2022 వృషభరాశి ఫలితములు
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణీ 1,2,3,4 పాదములు
మృగశిర 1,2 పాదములు
ఆదాయం 8
వ్యయం 8
రాజపూజ్యం 6
అవమానం 6
జనవరి : ఈ నెలయందు ఆర్ధికంగా మేలు జరుగుతుంది. రావల్లిన బాకీలు | వస్తాయి. వృత్తియందు ధనలాభము. ఉద్యోగమునందు శ్రమ చికాకులు ఉంటాయి. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. గౌరవ మర్యాదలు అనుకూలము. శుభవార్తలు వింటారు. ముఖ్యపనులు బుధవారములు చేయండి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఒక్క ఈశ్వర దర్శనము చేసుకోండి. కొంత ఆరోగ్యము ప్రాప్తించును.
ఫిబ్రవరి : ఈ నెల చాలా కాలంగా దాగియున్న కోర్కెలు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు శాంతిని వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు చురుగ్గాయుంటాయి. ఆశించిన ప్రయోజనము దరిలో యున్నది. పిల్లల చదువులు అనుకూలము. వివాహ సమస్యలు పూర్తి చేస్తారు. దేవుని దయతో కొన్ని శుభవార్తలు వింటారు. లోగడ వాయిదా పనులన్నియునూ పూర్తి చేస్తారు. బాల్యమిత్రులను కలుస్తారు. మాతృవర్గము అనుకూలధనము అందించును.
మార్చి : ఈ నెలయందు వివాహ నూతన ఉద్యోగాలు ఊపందుకొంటాయి. కొన్ని పనులు కూడా పూర్తి కావచ్చును. కొత్త మార్పులు వస్తాయి. ఆర్థిక లావాదేవి నిధానముగా జరుగును. సోదర వర్గముతో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా ప్రాబల్యము పెరుగును. ధన వ్యయము కూడా చేస్తారు. భార్యా అనుకూలంగా మేలగును. నూతన బాధ్యతలు వృత్తియందు రావచ్చును.
ఏప్రియల్ : ఈ నెలయందు ఆచితూచి అడుగువేయాలి. ఆర్థిక నష్టాలు రావచ్చును. అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని ఉపయోగించండి. వ్యవహారములు నిలకడగానుంటాయి. ఆరోగ్యము మందగిస్తుంది. దగ్గరలో విజయ మార్గమున్నది. ఉద్యోగరీత్యా బదిలీలు అవకాశములున్నాయి. దైవ బలము రక్షిస్తుంది. ఆర్థికంగా మరింత జాగ్రత్త వహించుట మంచిది.
మే : ఈ నెలయదు గ్రహాభివృద్ధి సామాగ్రి ఖరీదులు చేస్తారు. ప్రయాణములు లాభాదాయకముగా ఉంటుంది. పంతాలకు పట్టింపులకు వెళ్ళవద్దు. ఆస్థి కొనుగోలు విషయంలో ప్రగతి సాధిస్తారు. శుభకార్య వ్యయము అధికము, స్థాన చలనము కూడా వచ్చును. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. స్వల్ప ధన లాభములతో ఈ నెలయందు అనుభవిస్తారు.
జూన్ : ఈ నెలయందు పిల్లల విద్యాభివృద్ధి కలుగుతుంది. ధనవృద్ధి కలుగును. వృత్తి ఉద్యోగములందు గౌరవ మర్యాదలు పొందుతారు. శతృవులచే కొన్ని బాధలున్ననూ అవి క్రమేపి తొలగిపోవును. వస్తువుల అమ్మకము కొనుగోలు చేస్తారు. మంచి ఆభరణములు తెచ్చెదరు. ప్రభుత్వ జనులకలయిక దుష్టుల కలయిక, అధికశ్రమ కల్గించుకుంటారు.
జూలై : ఈ నెలయందు మానసిక భయము. మనఃకేశము కొంత కలుగుతాయి. ఆర్ధిక పుష్టిని పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగములందు చైతన్యవంతముగా అభివృద్ధిని, ఆర్థిక వృద్ధిని పొంద గలుగుతారు. జాయింటు వైరములు రావచ్చును. స్త్రీలబాధలు కొన్ని రావచ్చును. వ్యతిరేక వాదములు కలుగును.
ఆగష్టు : ఈ నెలయందు అనుకోని ఆపదలు వస్తాయి. భూ వసతులు పెరుగును. ధనవ్యయము చేస్తారు. ధనము నిఖచ్చిగా ఖర్చు పెట్టెదరు. బందు విరోధములు కొన్ని రావచ్చును. విదేశీయులతో సంచారము. విదేశీ బంధువులతో స్నేహము చేస్తారు. వ్యవహార విజయం కలుగుతుంది. వ్యాపార శ్రమ పెగుతుంది. గృహలాభ యోగము లభిస్తుంది.
సెప్టెంబర్ : ఈ నెలయందు ఆందోళనములు స్థాన చలన మార్గములు, స్త్రీల సమస్యలు రావచ్చును. నెల మధ్యలో వ్యాపారోద్యోగ వృత్తియోగములన్నియునూ బాగుగా యుండగలవు. విందు వినోదములు పొందెదరు. వాక్కాఠిన్యముతో గుమస్తాలమీద కోపముతోనుంటారు. కార్యములను సాధించి మనోవాంఛ నెరవేరుస్తారు. జాయింటా వ్యాపారాలు అచ్చిరావు. స్త్రీలకు ఆరోగ్యచర్చ బాగుగా జరుగుతుంది.
అక్టోబర్ : ఈ నెలయందు అభివృద్ధి మార్గంలో పయనించెదరు. కాంట్రాక్టు అందు స్పష్టత వస్తుంది. పెద్దల వద్ద పెనమ్రతతో వ్యవహరిస్తూ పనులను పూర్తి చేసుకోవాలి. మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవబలము రక్షించుకుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు ఆర్ధిక బలమును పుంజు కుంటారు. చేయని తప్పునకు నిందలు, నిందారోపణములు అనుభవించెదరు.
నవంబర్ : ఈ నెలయందు ధార్మిక మార్గాలు ఆచరించెదరు. బంధువులక ఉంటుంది. ఈ రోజు చేయు పనులు అనుకూలము. కొద్దిరోజుల్లో ప్రయాణ ములు అచ్చిరావు. ఆర్థికభారము అధికము. గృహములో శుభకార్యాలు చేయాలని ఆలోచించెదరు. నూతన స్త్రీలతో కలయికలు ఉంటాయి. షేక్ మార్కెట్ ధరలు అధికము. నిలబాటు పనులను పూర్తి చేయండి.
డిశెంబర్ : ఈ నెలయందు వృత్తి వ్యవస్థనందు కఠినముగా వ్యవహరించెదరు. అధికారులవలన అగౌరవము పొందుతారు. మిత్రురాండతో వైరములు రావచ్చును. కుటుంబములో మాట విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయాలందు జాగ్రత్త అవసరము. హృదయశూల ఆరోగ్యము బాధించవచ్చును. నవగ్రహ పూజలు పూర్తిచేయుట మంచిది. నవగ్రహ పూజాప్రదక్షణములు చేయుటమంచిది.
Related Rashi Phalalu:
> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు
వృషభరాశి, Vrushaba Rasi in telugu, vrishabha rashi 2022 in english, vrishabha rashi 2022 in telugu, vrishabha rashi 2022 telugu, vrishabha rashi today, mithun rashi 2022, kanya rashi 2022, vrishchik rashi 2022, kumbh rashi 2022
Comments
Post a Comment