Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డిసెంబరు 28న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల | TTD Srivani Trust – VIP Break Darshan - Tirumala

డిసెంబరు 28న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల.

2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 1000 బ్రేక్ దర్శన(రూ.500/- లఘు దర్శనం ) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు 1000 మహాలఘు దర్శన(రూ.300/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500/-) టికెట్లు అందుబాటులో ఉంటాయి.

anu

srivani trust ticket booking, srivani trust benefits, ttd vip break darshan tickets online booking, srivani trust ttd, ttd 300 rs ticket online booking, ttdsevaonline, ttd online, ttd free darshan tickets online booking

Comments