Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి..| COVID TEST MUST FOR DARSHAN – TTD REITERATES LATEST NEWS

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని కోర‌డ‌మైన‌ది.

ఇదివ‌ర‌కే టిటిడి ఈ విష‌యాన్ని తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే.

కొంతమంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి వారిని వెన‌క్కు పంపాల్సి వస్తోంది. దీనివ‌ల‌న అనేకమంది భ‌క్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.

కావున భక్తులు, ఉద్యోగుల మరియు వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడికి సంబంధించిన ఇత‌ర ఆల‌యాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని భ‌క్తులను కోర‌డ‌మైన‌ది.

tirumala latest news today, today breaking news in tirupati, tirupati covid restrictions today, is covid test mandatory for tirupati latest news, is free darshan available at tirupati now 2022, free darshan timings in tirumala today, ttd darshan for child during covid-19, tirumala online booking

Comments