Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు..NO HURDLES FOR DEVOTEES TO VISIT TIRUMALA- TTD EO

తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు..

తిరుమల మ‌ధ్య ప్ర‌యాణించేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండో ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయ‌ని, వీటి పునరుద్ధ‌ర‌ణ ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం లోపు బండ‌రాళ్లు, మ‌ట్టిని పూర్తిగా తొల‌గిస్తార‌ని ఈఓ తెలియ‌జేశారు. మొద‌టి ఘాట్ రోడ్డులో వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయ‌ని, సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు 2,300 వాహ‌నాలు, తిరుమ‌ల నుండి తిరుప‌తికి 2,000 వాహ‌నాలు ప్ర‌యాణించాయ‌ని వివ‌రించారు. చెన్నై ఐఐటి ప్రొఫెస‌ర్లు తిరుమ‌ల‌కు చేరుకుని విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌ల‌ను ప‌రిశీలించార‌ని, ఢిల్లీ ఐఐటి ప్రొఫెస‌ర్లు గురువారం ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. ఐఐటి నిపుణులు పూర్తిస్థాయిలో ప‌రిశీలించి సమర్పించే నివేదిక త‌రువాత త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఈఓ వివ‌రించారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్, సెక్యూరిటి, ఫారెస్టు, ఆరోగ్య విభాగం తదితర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఈఓ ఆదేశించారు.

tirumala news today in telugu, ttd online, free darshan timings in tirumala today ttd 300 rs ticket online booking, ttd darshan news, ttd toll free number, ttd kalyanam tickets, ttd online free

Comments