తిరుమలకు వెళ్తున్నారా.. ఇది చదవండి ..! తిరుమల లో ఇచ్చే ఉచిత దర్శనం టికెట్స్ వీరికి మాత్రమే ఇస్తారు - They are the only ones who are given free darshan tickets in Thirumala
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టిటిడి వుందన్నారు.
ఆన్లైన్ లో ఫిబ్రవరి నెలకు 1 నుండి 15 తేదీ వరకు ఫ్రీ టికెట్స్ విడుదల చేశారు. మిగతా తేదీలకు టికెట్స్ విడుదల చేయలేదు. 16వ తేదీ నుండి కొరోనా తగ్గితే టెంపుల్ దగ్గర అందరికీ ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వాలని దేవస్థానం వారు నిర్ణయం తీసుకున్నారు. కోవెద్ టెస్ట్ లేదా వాక్సిన్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్స్ ఇస్తారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా తిరుపతి లో ఆఫ్ లైన్ విధానం లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా, కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందు వల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశం పై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి భక్తులకు తెలియజేశారు.
tirumala news today live, today breaking news in tirupati, free darshan timings in tirumala todaytirumala latest news today telugu, ttd free darshan online booking availability, ttd online, tirupati temple open or closed today, tirumala latest news today darshnam tickets
Comments
Post a Comment