02 ఫిబ్రవరి 2022 నుండీ రాబోయే 9 రోజులూ సామాన్యమైనవి కాదు | 9 Powerful days r coming up | Nanduri Srinivas
త్వరలో గుప్త నవరాత్రులు రానున్నాయి. సమృద్ధిగా ఆధ్యాత్మిక శక్తిని వెతకడానికి అద్భుతమైన సమయం. దీన్ని చేయడానికి సులభమైన మార్గాన్ని ఈ వీడియో వివరిస్తుంది.
తెలుగు & ఆంగ్లంలో శ్యామలా స్తోత్ర సాహిత్యం మీ GMail idతో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
https://drive.google.com/file/d/1odkucbbmPUVlNrfoE41RJhpcx1MCh34_/view
Q) Where is Shyamala Dandakam Audio & PDF?
Q) శ్యామలా దండకం చదివిన ఆడియో , PDF ఎక్కడున్నాయి?
తొందర్లో లింక్ ఇస్తాము. ఇక్కడ చూస్తూ ఉండండి . We will give the link soon, check back
Q) 2022 లో శ్యామలా నవరాత్రులు ఎప్పుడు? ఏ సమయంలో చేయాలి.
A) 2-Feb-2022 నుండీ 10-Feb-2022 వరకూ . 11 AM - 12 Noon, భోజనానికి ముందు ఈ పూజ చేయాలి . ఒక పూట చేస్తే చాలు
Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?
A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం
Q) నా దగ్గర శ్యామలా దేవి ఫోటో లేదు, ప్రింటర్ లేదు, మొబైల్/లాప్ టాప్ లో పెట్టుకోవడానికి అవి కూడా లేవు, నేను వేరే అమ్మవార్ల ఫోటో ముందు కూర్చొని చేసుకోవచ్చా?
A) చేసుకోండి. మనస్సులో శ్యామలా రూపాన్ని ధ్యానించండి
Q) శ్యామలా దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు. ఆ తల్లి సరస్వతీదేవికే మరొక (తాంత్రిక) రూపం
Q) ఈ స్తోత్రం శ్యామలా నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా విసుకుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి
Q) మా ఇంట్లో దేవి ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి
Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
Shyamala Navratri, 2022 Magha Gupta Navratri, Magh Navratri, Raja Syamala Navaratri, shyamala navaratri 2022 dates
Comments
Post a Comment