Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుపతి భక్తులకు శుభవార్త (స్థానికులకు) వైకుంఠ ద్వార ఉచిత దర్శనం టికెట్ల జారీ | Tirumala Vaikunta Ekadasi 2022 Tickets Tirupati Locals

జనవరి 10వ తేదీ స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత దర్శనం టికెట్ల జారీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు.

తిరుపతి లోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణ పురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శ్రీ ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. టికెట్లు పొందిన భక్తులు ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.

తిరుమల, TTD Vaikunta Ekadasi, Tirumala Vaikunta Ekadasi, Vaikunta Ekadasi 2022 Tickets, Tirupati Locals, ttd vaikunta ekadasi 2022 tickets online booking

Comments