రుద్రాభిషేకం అనేది మన జీవితాన్ని ప్రాపంచిక వ్యవహారాలలో మరియు ఆధ్యాత్మికతలో రాణించడానికి ఒక ప్రత్యేకమైన మార్గం.
రుద్రాభిషేకం జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ ఎవరి సహాయం లేకుండా ఇంట్లో అభిషేకం చేయడం కష్టం
ఈ వీడియోలో రుద్ర అభిషేకం చేయడానికి సులభమైన మార్గాన్ని వివరిస్తాము. ఈ ప్రక్రియ రుద్ర నమకం/చమకం వలె శక్తివంతమైనది, అయితే ఇది కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుంది మరియు పురుషులు/మహిళలు/పిల్లలు/ఏ కులం/వితంతువులు మొదలైనవారు కూడా చేయవచ్చు.
అధ్యాయాలు:
0.00 కులమతాలకు అతీతంగా పూజ
3.10 నండూరి గారిచే పల్లవి
ఈ పూజకు 5.58 నియమాలు
మహాశివరాత్రి విశిష్టత తెలుగు పిడిఎఫ్ బుక్ ఫ్రీ డౌన్లోడ్.
https://drive.google.com/file/d/1wWds.
Q) స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయవచ్చా?
A) చేయవచ్చు
Q) ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా?
A) రెండంగుళాల పరిమాణం దాటనిది ఉంచుకోవచ్చు
Q) ఊరు వెళితే?
A) శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఎవ్రరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించండి
Q) శివలింగం ఎలాంటిది అయితే మంచిది?
A) సామాన్యంగా ఇత్తడి, స్ఫటికం, రాయి, , మట్టి, వెండి లాంటి ఉత్తమ ధాతువులు మంచివి. Plaster of Paris లాంటి ధాతువులు వాడకూడదు
Q) ప్రదోష వేళ కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా ఈ అభిషేకం?
A) చేసుకోవచ్చు
Q) కార్తీక మాసం అయ్యాకా ఆ శివలింగం ఏం చేయాలి?
A) మీరు ప్రేమతో పూజ చేసిన లింగం కదా, పూజా మందిరంలో ఉంచుకోండి. ఏమీ కాదు
Q) రోజూ తల స్నానం ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు .
Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం శివ పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
Q)ఈ స్తోత్రంతో అభిషేకం చేయకుండా మామూలుగా నోటితో చదువుకోవచ్చా?
A) చదువుకోవచ్చు
Q) మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా? మట్టి శివలింగానికైనా చేసుకోవచ్చా? శివుని చిన్న ప్రతిమ ఉన్నా దానికి చేసుకోవచ్చా? శివుడూ పార్వతీ ఉన్న ప్రతిమకి చేసుకోవచ్చా?
A) చేసుకోవచ్చు
Q) అభిషేక జలం ఏం చేయాలి?
A) చాలామంది తీర్థంగా తాగేస్తారు. అలా చేసినా పర్లేదు. లేకపోతే మొక్కల్లో పోసేయండి.
nanduri srinivas wikipedia, nanduri srinivas phone number, nanduri srinivas family, nanduri srinivas website, nanduri srinivas wife, nanduri srinivas contact number, nanduri srinivas family photos, nanduri srinivas videos
Siva abhishekam water midha posukovacha
ReplyDelete