Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ | Mallikarjuna Temple, Srisailam

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు చెప్పారు.

శ్రీశైలం ఆలయం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చని దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు రూ.200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 5 వేల శీఘ్ర దర్శనం, 2 వేల అతి శీఘ్ర దర్శనంతోపాటు 12 స్లాట్ ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

కాలినడకన వచ్చే భక్తులకు రిస్ట్ బ్యాండ్ తగిలించి వారికీ నేరుగా అతి శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. మల్లన్న భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దర్శన సమయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Ticket Booking online: https://www.srisailadevasthanam.org/en-in/home

Mallikarjuna Temple, Srisailam, srisailam temple timings today, srisailam temple online booking, srisailam temple open or not today, srisailam temple open, srisailam temple timings tomorrow, srisailam temple today news, srisailam temple darshan timings, srisailam temple photos

Comments