శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి కి వెళ్లే భక్తులకు అలెర్ట్ | TTD Free Darshan Sarvadarshanam tokens
సర్వదర్శనం టోకెన్లు కోసం వచ్చే భక్తులకు మూడు లేదా నాలుగు రోజులు సమయం పడుతోంది.
శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి కి వెళ్లే భక్తులకు అలెర్ట్.. స్వామి వారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లు కోసం వచ్చే భక్తులకు మూడు లేదా నాలుగు రోజులు సమయం పడుతోందని భక్తులకు టీటీడీ తెలిపింది. కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని నిబంధనల నడుమ ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ లో టోకెన్లు జారీ చేస్తూ సర్వదర్శనానికి భక్తులకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి లో ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి లో ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. 20వ తేదీ (నేడు) టోకెన్ పొందిన భక్తులకు ఈ నెల 24వ తేదీ దర్శనం సమయం లభిస్తోంది. కావున భక్తులు, ఇది గమనించి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని తిరుపతికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతి కి వచ్చి ఇబ్బందులు పడవద్దని భక్తులకు టీటీడీ సూచిస్తోంది.
ttd, tirumal news, tirupati, sarvadarshnam tickets, ttd online
Comments
Post a Comment