తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి మార్చి 17, 18వ తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం తిరుమల విజివో శ్రీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై విజిలెన్స్, పోలీస్, ట్రాఫిక్, ఆర్‌టిసి, అగ్నిమాపక, టిటిడిలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజివో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి మార్చి 17వ తేదీ ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటలవరకు, మరల తిరిగి మార్చి 18వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా మార్చి 17వ తేదీ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో తీర్థానికి అనుమతిలేదని, ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద మార్చి 17, 18వ తేదీల్లో అన్నప్రసాదాలు భక్తులకు అందించనున్నట్లు చెప్పారు. పాపవినాశనం డ్యామ్ వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్, తుంబురు తీర్థం వద్ద ఒక వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసివారు తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి త్రాగునీటి కొళాయిలు, మార్గమధ్యలో నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళకుండా రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలవారు సమన్వయంతో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజివో కోరారు.
tumburu theertham tirumala 2022 dates, tumburu theertham opening date 2022, tumburu theertham timings, tumburu theertham images, tumburu theertham story, distance between tirumala to tumburu theertham, tumburu theertham history in telugu
Comments
Post a Comment