విశాఖ సాగర తీరంలో కొలువుదీరిన శ్రీనివాసుడు..మార్చి 18 నుండి 23వ తేదీ వరకు విశాఖలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ..| Sri Venkateswara Temple, Visakhapatnam, Rushikonda hill
విశాఖ సాగర తీరంలో కొలువుదీరిన శ్రీనివాసుడు..కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.. విశాఖ సాగరతీరంలో కొలువుదీరుతున్నారు. నగరంలోని రిషికొండపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
మార్చి 18 నుండి 23వ తేదీ వరకు విశాఖలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ..
విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 23వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
మార్చి 18వ తేదీన శుక్రవారం రాత్రి 7 నుండి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
మార్చి 19న శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యగాశాలవాస్తు, పంచగవ్య్రపాశనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, బింబశుద్ధి, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, హోమం నిర్వహిస్తారు.
మార్చి 20న ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు హోమం, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
మార్చి 21న సోమవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హోమం, జలాధివాసం, యాగశాల కార్యక్రమాలు.
ttd, Sri Venkateswara Temple, Visakhapatnam, Rushikonda hill, ttd temple in vizag rushikonda timings, ttd temple in vizag rushikonda opening date, ttd temple, rushikonda contact number, ttd login, ram mandir in visakhapatnam, visakhapatnam temple images, ttd online, venkateswara swamy temple near me
Comments
Post a Comment