మార్చి21 న ఏప్రిల్, మే, జూన్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రూ.300/- కోటా విడుదల - Special Entry Darshan Tickets Release March 21
శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు.
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
అదేవిధంగా, సర్వదర్శనం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్లు చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు గృహస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా గృహస్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన గృహస్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
ttd online ticket booking, ttd online login, ttd free darshan online booking availability, ttd 300 rs darshan online booking availability, ttd online free, ttd online room booking 100 rs, ttd online booking for darshan 500 rupees ticket, ttd online booking for suprabhata seva,
Comments
Post a Comment