Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రాబోయే 9 రోజులూ ఇలా చేస్తే అపమృత్యు భయం పోతుంది | 9 powerful days are coming | Nanduri Srinivas

ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు సంవత్సరంలో 9 ముఖ్యమైన మరియు శక్తివంతమైన రోజులు. ఆ రోజుల్లో దీక్ష ఎలా చేయాలో నండూరి గారు ఈ వీడియోలో వివరించారు..

Ugadi to Srirama Navami are 9 important and powerful days in a year.

In this video Nanduri  garu explains how to do deeksha on those days

Puja PDF: (Use GMail to download)

https://drive.google.com/file/d/14Uhg01E_SUgkWFWetCFqVRbZ49vOyQiK/view


Puja Demo Video:

https://www.youtube.com/watch?v=r0pXvZXoloc&t=3s


Khadgamala chanted by Nanduri garu


Frequently asked questions:
Q) ఉదయం కుదరకపోతే పూజ సాయంత్రం చేయవచ్చా?
A) ఎప్పుడైన చేయండి . చేయడం ముఖ్యం  

Q)  ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ ఒక 20 నిముషాలు సమయం వెచ్చించి పూజ చేయమని చెప్పండి 

Q) మా ఇంట్లో లలితా దేవి ఫోటో లేకపోతే దుర్గా దేవి ఫోటోకో మరే అమ్మవారి ఫోటోకో చేయవచ్చ?
A) చేయవచ్చు 

Q) వసంత నవరాత్రులు 2022 లో ఎప్పటి నుండీ ఎప్పటి వరకూ
A) 2/Apr (Ugadi) to 10/Apr (Srirama Navami)

Q) ఉద్వాసన ఎప్పుడు చేయాలి?
A) Last రోజు ఉదయం పూజ అయ్యాకా

Q) ఆఖరి రోజు పెట్టిన చీర ఏం చేయాలి?
A) మీరు కట్టుకోండి. లేకపోతే ఎవరైనా ముత్తైదువకి పెట్టి నమస్కారం చేయండి 

Q) ఒకవేళ  కలశం పెడితే 9 రోజులూ అలానే ఉంచాలా?
A) అవును. ఆఖరి రోజు దాకా తీయకండి . తరువాత  కొబ్బరికాయ నీటిలో వదిలేయండి 

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు 

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play  చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి 

Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A)  ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం. 

Q) లలితా సహస్రంలో 6 అన్న ప్రసాదాలే చెప్పారు, మరి 9 రోజులకి ఎలా ?
A) వాటినే మళ్ళీ Repeat చేయండి. లేకపోతే పులిహారల్లోనే రకాలు చేయండి 

Q) పురుషులు పూజ చేయవచ్చా?
A) Yes 

Q) వితంతువులు పూజ  చేయవచ్చా?
A) షోడశోపచార పూజ చేయవచ్చు, స్తోత్రాలన్నీ చదవవచ్చు . సామాన్యంగా కుంకుమార్చన కూతురి చేత కానీ, కోడలి చేత కానీ చేయిస్తారు , వాళ్ళ సౌభాగ్యం నిలవాలని 

Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి 
Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి? 
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ  లేకపోతే నీటిలో వదిలేయండి

Q) మా ఇంట్లో Lalitha దేవి ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి 

Q) 9 రోజులు కుదరకపోతే?
A) కుదిరినన్ని రోజులు చేయండి 

Q) నవరాత్రులు చెశేటప్పుడు ఉపవాసం ఉండాలా?
A) అవసరం లేదు, సాత్వికాహారం మితంగా తీసుకుంటే చాలు 

Q) "యజ్ఞేన యజ్ఞ" అనే వేదమంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు మంత్రపుష్పంతో సరిపోతుంది. మంత్రపుష్పానికి అర్ధం అదే 

Q) అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పించవచ్చా?
A) దేవతా మూర్తులూ, ఋషి పత్నులూ అందరూ యజ్ఞోపవీతం ధరిస్తారు

 Famous Posts:

నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం

అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం..

సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి.

ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం.

టెంకాయ కుళ్ళినా - హారతి ఆరినా - వెంటనే ఇలా చేయండి.

తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది?

తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.

కఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం

Nanduri Srinivas, Latest videos on nanduri srinivas, nanduri srinivas wikipedia, nanduri srinivas phone number, nanduri srinivas family photos, nanduri srinivas house address, ugadi, srirama navami

Comments