తిరుమల వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. ఆఫ్ లైన్ లో సిఆర్వో ఆఫీస్ వద్ద శ్రీవారి ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ టికెట్స్ , అంగప్రదక్షిణ టోకెన్లు జారీ | Angapradakshinam At Tirumala
ఏప్రిల్ 1వ తేదీ నుండి సిఆర్వో వద్ద ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవలు..
భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్లు..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం కోవిడ్-19 ముందు ఉన్న పద్ధతులనే అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, గతంలో ఇస్తున్న విధంగానే తిరుమల సిఆర్వో కార్యాలయం వద్ద గల కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో సుప్రబాతం, తోమల్ల, అర్చన మరియు అష్టదళం కోసం సేవా ఎలక్ట్రానిక్ DIP కోసం నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది. ఇందుకోసం భక్తులు ముందురోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నమోదు చేసుకుంటే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులను ఏప్రిల్ 2 నుంచి (అంటే ఉగాది నుంచి) శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ చేసేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అంగ ప్రదక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి టోకెన్లను జారీ చేయనుంది. కొవిడ్ దృష్ట్యా గత రెండేళ్లుగా అంగప్రదక్షణను టీటీడీ రద్దు చేసింది. మెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అనుమతి ఇస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
మర్చి లో వర్చువల్ సేవా కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ 2022 లో దర్శనం చేసుకోవడానికి వర్చువల్ సేవా గృహాల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా బుకింగ్ కోసం 23.03.2022 3:00 PM నుండి అందుబాటులో ఉంటుంది.
angapradakshinam in tirumala 2022, tirupati angapradakshinam timings, angapradakshinam by ladies, angapradakshinam benefits, how to book, angapradakshinam in tirumala, ttd angapradakshinam online booking, tirupati angapradakshinam, angapradakshinam in telugu
Comments
Post a Comment