జూన్ 11 నుంచి భక్తులకు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు - JYESTABHISHEKAM /ABIDEYAKA ABHISHEKAM SEVA TICKETS TO BE RELEASED
తిరుమలలో జూన్ 12 నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరంట్ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
రోజుకు 600 టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. ఒక్కో టికెట్ ధర రూ.400/-గా నిర్ణయించారు. సిఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భక్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవకు ఒక రోజు ముందుగా మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేస్తారు. ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అందజేస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలి. ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జరుగుతుంది. సేవ అనంతరం భక్తులను మహా లఘుదర్శనానికి అనుమతిస్తారు.
ttd, tirumala, tirumala news,ttd updates, tirumala tickets
Comments
Post a Comment