Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తలరాతని తిరగరాసే మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం మీరు చేయండి | This puja can give everything in life | Nanduri Srinivas

వచ్చే సోమవారం చాతుర్మాస్యంలో మొదటి సోమవారం, మీ విధిని మార్చగల గొప్ప ప్రక్రియ ఇక్కడ ఉంది. తప్పకుండా ప్రారంభించండి.

వచ్చే సోమవారం చాతుర్మాస్యంలో మొదటి సోమవారం, మీ విధిని మార్చగల గొప్ప ప్రక్రియ ఇక్కడ ఉంది. తప్పకుండా ప్రారంభించండి.

Below link has Pooja PDF in English & Telugu (This can be downloaded only with your GMail id, not with any other EMail id) 

https://drive.google.com/file/d/1gaXUMyAKQiA3ZtB7wHcfDXbdbedcQxrk/view

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?

A) చేయవచ్చు. 


Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా?

A) చేయకూడదు 


Q) షోడశ సోమవారాల మధ్యలో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి?

Q) ఈ పూజని శివ పార్వతుల నిత్య పూజలా చేసుకోవచ్చా?

Q) శివలింగం చేయడానికి మట్టి దొరకకపోతే ఏం చేయాలి? 

A) వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు Skip చేయకుండా వినండి 

Note: మట్టి శివలింగాలని వీడియోలో చెప్పినట్టు చేయాలి . మన పూజా మందిరంలోని శివలింగాలైతే మామూలుగా పూజ చేసుకోవచ్చు. నీటిలో కలపనవసరం లేదు . 

శివలింగాలు ఏవారానికి ఆ వారం నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే 16 అయ్యాకా చేయవచ్చు 


Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? 

A) https://www.youtube.com/watch?v=Lm14pYFDlRw&t=0s


Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?

ఆ) పిల్లలు చదివిన వీడియో పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి.


Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా?

ఆ) ఏ సోమవారమైనా ప్రారంభించవచ్చు.

Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా?

ఆ) ఏటి సూతకంలొ ఉన్నవారు సూతకం అయ్యేదాకా వ్రతాలు చేయకూడదు. నిత్య పూజ చేసుకోవచ్చు.


Q) కలశం, పీట, భ్లౌసె , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి? 

ఆ) ప్రతీ వారం పూజ అయ్యాకా తీసి వేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు . కొబ్బరికాయ నిలువ ఉండదు కనుక వండుకు తినండి, లేకపోతే నీటిలో వదిలేయండి.

 

Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?

ఆ) అది మానేసి మిగితా పూజ చేసుకోండి.


Q) మా ఇంట్లో శివ పార్వతుల ఫోటో లేదు, ఏం చేయాలి?

ఆ) Internet లోంచి Printout తీసుకోండి.


Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే నేను ఏం చేయాలి?

ఆ) ఎవ్వరూ కూర్చోకపోతే మీరొక్కరే చేయండి.


Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?

ఆ) పూజ చేసిన సోమవారం రోజు రెండూ పాటించాలి.


Q) ఇంటికి అతిధులు రాకపోతే ఆలయంలో పూజారికి స్వయం పాకంకి కావల్సిన వస్తువులు ఈయవచ్చా?

A) ఈయవచ్చు.


Q) ఇంటి దగ్గర నదిలేకపోతే శివలింగ నిమజ్జనం ఎలా?

A) ఒక గిన్నెలో నీళ్లల్లో కరగించి , ఆ నీరు తులసి మొక్కలో పోసేయండి.


Q) వ్రతం మధ్యలో ఒక వారం ఊరు వెళ్ళాల్సి  వస్తే?

A) వెళ్లండి, కానీ పూజ మానకుండా అక్కడ చేయండి.

NanduriSrinivas, ChaturmasyaVratham, ShodasaSomavaraVratham, 16SomavarasVratha,,  DailySivaPooja, Nanduri, NanduriSrinivasSpeeches, NanduriSrinivasLatestVideos, NanduriSrinivasSpiritual , NanduriSri, NanduriSrinivasVideosLatest

Comments