జూన్ 1 నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధించినట్లు టీటీడీ తెలిపింది. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టిటిడి అధికారులు సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని.. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు.
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.
ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గాని పేపర్ కవర్లు గాని ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూ ప్యాకెట్లు కూడా విక్రయించరాదని.. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. షాపుల దగ్గర అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తిరుమలలో హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలన్నారు. తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని.. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలన్నారు. దుకాణదారులు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని కోరారు.
జూన్ 1 నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని చెప్పారు. దుకాణదారులు ఒక సంకల్పంతో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. భక్తులు కూడా ఈ నిబంధనల్ని పాటించి తమకు సహకరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా ఉంటే అక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు.
Tirumala, ttd, tirumala news, tirupati,
Comments
Post a Comment