ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చిందనే విషయంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. కొందరేమో ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రోజున జరుపుకోవాలని చెబుతున్నారు.. మరికొందరు ఆగస్టు 19వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చింది.. రోహిణి నక్షత్రం తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి(ఎనిమిది) రోజున శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు.
ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చిందనే విషయంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. కొందరేమో ఆగస్టు 18వ తేదీన అంటే గురువారం రోజున జరుపుకోవాలని చెబుతున్నారు.. మరికొందరు ఆగస్టు 19వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడొచ్చింది.. రోహిణి నక్షత్రం తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఆగస్టు 18 లేదా 19?
భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి 18 ఆగస్టు 2022 గురువారం 09:21 నుండి ప్రారంభమై...అష్టమి తిథి శుక్రవారం, 19 ఆగస్టు 2022 రాత్రి 10.50 గంటలకు ముగుస్తుంది. గ్రంథాల ప్రకారం, కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు, కాబట్టి చాలా మంది ఆగస్టు 18 నే జన్మాష్టమి జరుపుకుంటారు. అయితే సూర్యోదయం ప్రకారం, ఆగస్టు 19 న జన్మాష్టమి జరుపుకోవడం కూడా ఉత్తమంగా కొందరు భావిస్తున్నారు.
పూజ ముహూర్తం
ఆగస్టు 18వ తేదీ 12:20 నుండి 01:05 వరకు శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి మంచి సమయం. పూజ వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడే.. వృషి మరియు ధ్రువ యోగాల కలయిక ఉంది. దీంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. వృద్ధి యోగం 17 ఆగస్టు 2022న రాత్రి 08.56 గంటలకు ప్రారంభమై ఆగస్టు 18న రాత్రి 08.41 గంటలకు ముగుస్తుంది. వృద్ధి యోగంలో కన్నయ్యను పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ధృవ యోగం 18 ఆగస్టు 2022న రాత్రి 08.41 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 19 రాత్రి 08.59కి ముగుస్తుంది.
> కృష్ణాష్టమి విశిష్టత , పూజా విధానం
కృష్ణాష్టమి, Krishnashtami, Janmashtami, Sri Krishna Janmashtami date, august
Comments
Post a Comment