వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు
ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది. చవితి నుంచి చతుర్థశి వరకూ ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడిని ఆ తర్వాత వైభవంగా గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 31 బుధవారం వినాయకచవితి వచ్చింది...
ఆగస్టు 30 మంగళవారం మధ్యాహ్నం దాదాపు 2 గంటల 29 నిముషాలకు చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
ఆగస్టు 31 బుధవారం మధ్యాహ్నం 2 గంటలవరకూ చవితి ఉంది..తదుపతి పంచమి ప్రారంభమవుతుంది
సాధారణంగా సూర్యోదయమే లెక్క కాబట్టి..వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలన్నది ఎలాంటి సందేహం లేదు.
ఆగస్టు 31 బుధవారం రోజు వర్జ్యం ఉదయం 7.55 నుంచి 9.31 వరకు ఉంది
ఇదే రోజు దుర్ముహూర్త కూడా ఉదయం 11.35 నుంచి 12.23 వరకు ఉంది
అందుకే బుధవారం వినాయకపూజ చేసేవారు వర్జ్యం,దుర్ముహూర్తం ఘడియలు లేకుండా చూసుకోవాలి.
ఉదయం 7.55 లోపు లేదంటే... తొమ్మిదిన్నర దాటిన తర్వాత పూజ చేసుకోవడం మంచిది
మళ్లీ పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కూడా ( దుర్ముహూర్తం సమయం) పూజ ప్రారంభించవద్దు
మీరు పూజ ప్రారంభించిన తర్వాత వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్నా పర్వాలేదు...ప్రారంభసమయమే పరిగణలోకి తీసుకోవాలి.
తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు:
వినాయక విగ్రహాన్ని కొనుగోలుచేసేవారు తొండం ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి
రసాయనాల్లో ముంచితీసిన వినాయకుడిని కాకుండా మట్టి విగ్రహం వినియోగించడం మంచిది
పార్వతీ తనయుడు నైవేద్య ప్రియుడు..అందుకే మండపాల్లో ఉండే స్వామివారికి నిత్యం నైవేద్యం సమర్పించినట్టే ఇంట్లో మీరు ఎన్నిరోజులు ఉంచితే అన్ని రోజులూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వినాయకుడికి ఇష్టమైన వంటకాలైన కుడుములు, మోదకం, లడ్డు సహా పలు పిండివంటలు నైవేద్యం పెట్టాలి
విగ్రహ నిమజ్జనం కోసం కచ్చితంగా నదులు, సముద్రాల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. నదిలో కలిసే పిల్లకాలువలో నిమజ్జనం చేయొచ్చు
శుభ్రంచేసిన బకెట్లో నింపిన నీళ్లలో కూడా వినాయకుడిని నిమజ్జం చేసి ఆ నీటిని చెట్లకు పోయాలి.
Famous Posts:
> వినాయక వ్రతకల్పము | శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానం
> శ్రీ వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రి.
> ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూపాన్ని ఆరాధించాలి .!!
> వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు?
vinayaka chaturthi, ganesh chaturthi puja time today 2022, vinayaka chavithi usa, ganesh chaturthi date, vinayaka chavithi date, vinayaka chavithi telugu
Comments
Post a Comment