మొదటి సారి, "శ్రీనివాస విద్య వెల్లడి అవుతోంది!!
ఉద్యోగాలు కోల్పోయి జీతాల్లో కోతలను ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో చాలా మంది తమ ఆర్థిక సమస్యల గురించి నండూరి గారికి మెయిల్ చేస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీ విద్యారణ్య స్వామిచే అన్వయించబడిన "శ్రీనివాస విద్య" అనే మంత్ర శాస్త్రం నుండి అద్భుతమైన నిరూపితమైన సాంకేతికత ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు మీ అందరికీ వెల్లడి చేయబడుతోంది. ఈ వీడియో వివరిస్తుంది.
- ఈ విద్య వెనుక ఒక అద్భుతమైన చారిత్రక సంఘటన
- ఇందులో ఉపయోగించే మంత్రాలు ఏమిటి
- ఈ మంత్రాలను వర్తింపజేయడానికి 3 రకాల విధానాలు
PDF Document link to these mantras Telugu
https://drive.google.com/file/d/1lwWG2uB64rhJXQJXHicmFqderwYlpRfV/view
కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...
ప్ర) ఈ విద్య ముఫ్పై రోజులు వరుసలోనే చేయాలా? మరి ఆడవాళ్లకి ఎలాగ? | నా భర్త చేయడానికి ఒప్పుకోవట్లేదు, కానీ మా ఇంట్లో ఆర్ధిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి - ఎలాగ?
జ) అవును, శుక్లపక్ష పాడ్యమి రోజే మొదలు పెట్టి నెల ముఫ్పై తిథుల్లో చేయలి. స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది కనుకనే పురుషులూ చేస్తూంటే స్త్రీలు పక్కన కూర్చుంటారు (వివాహం అయిన వాళ్లైతే భర్త తోనూ, కాని వాళ్ళు తండ్రి తోనూ) మీ భర్తకి ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, చేయడం ఇష్టం లేదంటే, దుష్కర్మ ఇంకా వెంటాడుతోందని అర్ధం. అటువంటప్పుడు సత్ క్రియలు చేసే బుధ్ధి కలుగదు. వినకపోతే బలవంత పెట్టకండి. ఇష్టంతో చేయాలి కానీ, అయిష్టంగా కాదు! మీరు కూర్చుని కనకధార చదువుకోండి. ఆర్ధిక సమస్య అనేది ఇద్దరూ కలిసి పొందే కష్టం - పరిహారం కూడా ఇద్దరూ కల్సి చేయడం ఉపయుక్తం.
ప్ర) పురుష సూక్తంలో 15 కన్నా ఎక్కువ మంత్రాలు ఉన్నాయిగా, మరి అవి?
జ) ఈ విద్యలో 15 వరకూ చాలు.
ప్ర) ఒక నెలలో శుక్లపక్షం 14 రోజులే ఉంటే ఏమి చేయలి?
జ) 14 రోజులే చేయండి. పక్షం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే చేయాలి
ప్ర) వీడియోలో చూపించిన లక్ష్మీ నారాయణుల ఫోటో ఎక్కడ దొరుకుతుంది ?
జ) https://www.quora.com/What-are-some-of-the-most-beautiful-pictures-of-Lord-Vishnu
ప్ర) సంకల్పం ఏమిటి?
జ) మామూలు దేశకాల స్తుతి చెప్పి, "ఐశ్వర్యాభి వృద్యర్ధం లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం శ్రీనివాస విద్యామహం కరిష్యే "
ప్ర)ఈ పూజ చేస్తూంటే మధ్యలో అశౌచం వచ్చింది, అప్పుడు ఏమి చేయాలి? ఆశౌచం అయిపోయాకా Continue చేయవచ్చా?
జ) భార్యకి అశౌచం వస్తే భర్త Continue చేయవచ్చు. భర్తకి కూడా అశౌచం వస్తే ఆసారికి దీక్ష break అయినట్టే!
Famous Posts:
> అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం.
> ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి.
> ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేస్తే తిప్పికొట్టే విధానం.
> ఈ ఇంట్లో దిగాకా అన్నీ కష్టాలే అనిపించినప్పుడు ఇలా చేయండి.
> తిరుమలలో పొరబాటున కూడా ఈ నాలుగు తప్పులూ చేయకండి.
శ్రీనివాస విద్య, NanduriSrinivas, Nanduri, SrinivasaVidya, NanduriSrinivasSpeeches, NanduriSrinivasSpiritual, NanduriSri, NanduriSrinivasLatestVideos
Comments
Post a Comment