ఆగస్టు 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..
అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 24న బుధవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, అక్టోబరు నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఆగస్టు 24న మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
కాగా, అక్టోబరు నెలకు సంబంధించి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటా ఆగస్టు 24న సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.
భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
ttd, tirumala, ttd tickets, tirupati, arjitha tickts, tirumala tickets released, anga pradakshina tickets
Comments
Post a Comment