Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Darshan Tickets Updates | Tirumala News Latest Information | Today Tirumala News

నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేయబడతాయి.

నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి. అయితే బ్రహ్మోత్సవం తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించ‌బ‌డ‌వు.

Tirumala Darshan Live Updates :

ఆగష్టు 28వ తేదీన 74297 మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 

ఆగష్టు 27వ తేదీన80312 మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ఆగష్టు 26వ తేదీన 69012  మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 

ఆగష్టు 25వ తేదీన 68128 మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 

ఆగష్టు 24వ తేదీన 74,748 మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 

300 Rupess Darshan Tickets Updates : 

ఆగ‌స్టు 24న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Tirumala Accommodation Information :

తిరుమల అక్టోబర్ నెలకు సంబందించి వసతి కోట ఆగస్టు 30 న ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది. 

TTD Lucky Dip Tirumala Arjitha Sevas Tickets Information:

అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు 24న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంది.

Virtual Seva At Tirumala Information:

అక్టోబ‌రు నెల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన ద‌ర్శ‌న టికెట్ల కోటా ఆగ‌స్టు 24న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల కానుంది.

Tirupathi Accommodation Latest Information :

ఆగష్టు 29 మధ్యాహ్నం 3 గంటలకు  సెప్టెంబర్ నెలకు తిరుపతి మరియు తలకోన లో  రూమ్స్  ఆన్లైన్ లో విడుదల.

Srivari Trust Donors Information:

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సెప్టెంబర్, అక్టోబర్, మరియు నవంబర్ 2022 నెలలో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. 26.08.2022 మధ్యాహ్నం 03:00 గంటలకు.

ట్రస్ట్‌లు/స్కీమ్ దాతలకు సెప్టెంబర్ 2022 మరియు అక్టోబర్ 2022 నెలలో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.

Tirumala Senior citizen Darshan Information:

సెప్టెంబర్ 2022 నెలలో సీనియర్ సిటిజన్లు/శారీరకంగా సవాలు చేయబడిన కోటా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

Comments