Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నవరాత్రి మొత్తం ఫలితాన్ని ఒకే రోజులో ఇచ్చే పూజ | Kumari - Kanya Puja - Devi Navaratrulu

అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవడంలో జాతి, మతం లేదా కుల భేదం లేదు.  సిద్ధాంతపరంగా, ఏ కన్య అయినా  కూడా దేవతగా భావించి పూజించవచ్చు.

అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా, 

రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా 

మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా, 

నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా, 

ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా, 

ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా, 

ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా, 

ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా,

తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా, 

పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా,

భావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర, త్రిశతీనామ, అష్ణోత్తర శతనామ, దేవీఖడ్గమాలా నామాదులతో, హరిద్ర, కుంకుమ పుష్పాదులతో అర్చించి, మంగళహారతులిచ్చి,. ఆభరణ, పుష్ప, చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును.

Kumari Puja Lyrics PDF - కుమారి పూజ PDF

https://drive.google.com/file/d/1XmNuc8GBRUlbT7PvAq-lRoc9nj-fvpxd/view

Q) వీడియోలో చెప్పిన వయస్సు పిల్లలు దొరకకపోతే? If we dont get all children of these age groups what to do?

A) ఏ వయస్సు వాళ్ళు దొరికితే వాళ్లకి చేయండి. 

Q)నవరాత్రుల్లో కుమారీ (కన్యా) పూజ సొంత కూతురికి చేయవచ్చా? 

Can we do Kumari (Kanya) pooja for own daughter?

A)Watch below video. It is answered there

https://www.youtube.com/shorts/LzOxRK...

Q) If we find Only 2 girls for Kumari Puja, what to do?

కుమారీ పూజకి ఇద్దరు అమ్మాయిలే దొరికితే ఏం చేయాలి?

A) దొరికినంత మందికీ  చేస్తే సరిపోతుంది .నవరాత్రులు అయ్యేలోపు కనీసం ఒక్కరికైనా చేయండి. ఆ పూజ అనంత ఫలితాన్ని ఇస్తుంది  Do Puja for whoever available. BeforeNavaratris get over do atleast one Kumari Puja. It gives immense result.

కుమారి పూజ, సుహసిని, nanduri, nanduri srinivas, spiritual, pravachanalu, navratri, navaratri, navarathri, navadurga, kumari pooja, suvasini puja, devi navaratrulu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు