రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. గతేడాది ధరను బ్రేక్ చేస్తూ.. రికార్డ్ స్థాయిలో లడ్డూ ధర పలికింది.
హైదరాబాద్ లోని బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు ధరకు వేలంలో అమ్ముడైంది. రూ.24.60 లక్షల ధరకు పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి వేలంలో లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.18.90 లక్షలు పలికింది. లడ్డూ వేలంలో మొత్తం 9 మంది పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు.
ఉదయం 6 గంటల సమయంలో మొదలైన బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు బాలాపూర్ సెంటర్‌లో నిలిచింది. బాలాపూర్ గణేష్ కార్యవర్గ సభ్యులు ఈ లడ్డూ వేలంపాటను చేపట్టారు. లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం శోభాయాత్ర మొదలుకానుంది. కాగా, బాలాపూర్ లడ్డూ కి ప్రతీ ఏటా రికార్డ్ స్థాయి ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఎంత పలుకుతుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలాపూర్ గణేషుడి చెంత భక్తుల కోలాహలం ఉంది. తీన్మార్ బ్యాండ్ స్టెప్పులతో దద్దరిల్లిపోతోంది. కాగా, బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కేశవగిరి నుంచి ట్యాంక్‌బండ్ వరకు సాగుతుంది.
బాలాపూర్ లడ్డూ, balapura laddu, balapur, ganesh, vinayaka laddu, balapur vinayaka laddu velam
Comments
Post a Comment