Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత | TIRUMALA TEMPLE DOORS TO BE CLOSED

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత

అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ర‌క్ష‌ణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శ‌నంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ర‌క్ష‌ణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శ‌నంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

surya grahanam, chandra grahanam, ttd, tirumala news, ttd latest news, tirumala darshnam, ttd tickets

Comments