Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అక్టోబర్ 25న సూర్యగ్రహణ సమయం ఆ రోజున చేయవలసినవి.. చేయకూడనివి | Surya Grahanam 2022

గ్రహణము వివరములు:

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం,  న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం  కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు ఆల‌య త‌లుపులు మూసివేస్తారు.   అక్టోబర్ 24న 2022 సోమవారం దీపావళి అమావాస్య పూజలు చేసుకోవచ్చు.

భారతదేశంలో సూర్య గ్రహణ సమయం: 

అక్టోబ‌రు 25న 2022 మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది.

Also Readఅక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారికీ అనుకోని అదృష్టం.

ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు  ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు   నవంబర్ 7 సోమవారం కార్తీక పౌర్ణమి పూజలు చేసుకోవలెను.  న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7 గంట‌ల‌కు  ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.

సూర్యగ్రహణం చేయవలసినవి..  చేయకూడనివి:

భారతదేశంలో ప్రజలు సాధారణంగా గ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండటానికి ఇష్టపడతారు. గ్రహణ కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోరు. అలాగే గ్రహణం ఏర్పడే సమయంలో చెడు ప్రభావాలను నివారించడానికి దర్భ గడ్డి లేదా తులసి ఆకులను తినుబండారాల్లో, నీటిలో వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు  ధరించాలని చాలా మంది నమ్ముతారు.

దేశంలో అనేకమంది గ్రహణ సమయంలో సూర్య భగవానుడికి చెందిన మంత్రాలను పఠిస్తారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తారు.

చాలా మంది గ్రహణ సమయంలో నీరుని కూడా తాగరు.

అలాగే, గ్రహణ సమయంలో ఆహారాన్ని తయారు చేసుకోరు.. అంతేకాదు ఎటువంటి ఆహారపదార్ధాలను తినరు. శుభ కార్యాలను, పూజాధికార్యక్రమాలను నిర్వహించరు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

గ్రహణం పట్టిన సూర్యుడిని నేరుగా చూసే ప్రయత్నం చేయవద్దు. అలా చేయడం వలన కంటి చూపుకి శాశ్వత నష్టం కలిగించి అంధత్వానికి దారి తీయవచ్చు.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

సూర్యగ్రహణం, Surya Grahan, Solar Eclipse, Grahanam dates in 2022 in India, Chandra Grahan 2022 in India date and time, Grahanam dates in 2022 timings

Comments