Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అక్టోబర్ 25న సూర్యగ్రహణం దీపావళి ఎప్పుడు చేసుకోవాలి? Suryagrahanam On Diwali Festival

అక్టోబర్ 25న సూర్యగ్రహణం..

దేశ ప్రజలంతా పెద్ద ఎత్తున జరుపుకొనే దీపావళి నాడు (అక్టోబరు 25న) పాక్షిక సూర్యగ్ర హణం. పూజలు చేసే కార్తీక పౌర్ణమినాడు చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి.

25వ తేదీన సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకూ సూర్యగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష పండితులు తెలిపారు. ఆరోజేనే ప్రభుత్వాలు దీపావళి సెలవు దినంగా ప్రకటిం చాయి. అయితే..

Also Readఅక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారికీ అనుకోని అదృష్టం.

25వ తేదీ సాయంత్రం 4.19 గంటలకు అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆరోజు రాత్రిపూట అమావాస్య ఘడియలు ఉండవు. 24వ తేదీ ఉద యాన్నే చతుర్దశి తిథి ఉంటుందని. సాయంత్రం వచ్చిన అమావాస్య తిథి ఆ రాత్రంతా ఉంటుంది కాబట్టి. ఉదయాన్నే అభ్యంగన స్నానం, సాయంత్రం లక్ష్మీ పూజ నిర్వహించు కోవడం, పటాసులు కాల్చడం అదే రోజు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇక, కార్తీక పౌర్ణమినాడు (నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సూర్యాస్తమయం అయ్యాక కొద్ది సేపటి వరకే గ్రహణం ఉంటుది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం చివరి ఘడియల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే.. 

నవంబరు 7 సాయంత్రం నుంచే పౌర్ణమి ప్రారంభం అవుతుంది కాబట్టి 8న చంద్రగ్రహణం ఉన్నందున కార్తీక వ్రతాలేవైనా ఉంటే 7వ తేదీన జరుపుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

దీపావళి, సూర్యగ్రహణం, diwali, deepavali, suryagrahanam, chandra grahanam, dipavali date, diwali date telugu, 

Comments