ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 08 తేదిన రాబోతోంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న ఈ గ్రహణం భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కనిపించనుంది.
చంద్రగ్రహణం సమయాలు:
చంద్రగ్రహణం 2022 తేదీ: 08 నవంబర్ (మంగళవారం)
చంద్రగ్రహణం ప్రారంభ సమయాలు: సాయంత్రం 5:32 గంటలకు
చంద్రగ్రహణం ముగిసే సమయం: సాయంత్రం 06.18 గంటలకు
సూతక కాలం ప్రారంభ సమయం: ఉదయం 09:21
సూతక కాలం ముగిసే సమయం: సాయంత్రం 06.18
చంద్రగ్రహణం భరణీ నక్షత్ర జాతకులు, మేషరాశి వారు చూడరాదు. ఇదిలా ఉంటే, జ్యోతిష్యుల ప్రకారం 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించడం అశుభ ఫలితాలను తెస్తుంది. అంటే 15 రోజుల వ్యవధిలో వచ్చే రెండు గ్రహణాలు ప్రపంచంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చని అంటున్నారు. లేదంటే.. వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు. దీంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తవచ్చు, అభివృద్ధి వేగం మందగిస్తుంది. వ్యాపార తరగతి ప్రజలలో ఆందోళన పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
మత విశ్వాసాల ప్రకారం.. గ్రహణం అనేది మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఒక అశుభకరమైన సంఘటన. కాబట్టి ఈ గ్రహణాల వల్ల వచ్చే ప్రభావాలను అననుకూల మార్చుకుని పలు రకాల చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి దీని కోసం ముందుగానే ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణం క్రమంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదు. అంతేకాకుండా గ్రహణం సమయం తర్వాత ఇంటి తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చంద్ర గ్రహణం సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా గంగాజలంతో స్నానం చేయాల్సి ఉంటుంది.
> చంద్ర గ్రహణ సమయంలో ఇలాంటి పనులు చేస్తే అంతే
> చంద్ర గ్రహణం రోజు ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం
చంద్ర గ్రహణం, chandra grahan, chandra grahan 2022, chandra grahan 2022 timings, chandra grahan 2022 in india, chandra grahan 2022 live today, chandra grahan date and time
Comments
Post a Comment