శుభ ముహుర్తం..
ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీన ఆదివారం నాడు ఉదయం ధన త్రయోదశి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఏర్పడనుండి. దీంతో ఏదైనా కొత్త వస్తువులను కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
త్రయోదశి తిథి ప్రారంభం : 22 అక్టోబర్ 2022 శనివారం సాయంత్రం 6:02 గంటల నుంచి
త్రయోదశి తిథి ముగింపు : 23 అక్టోబర్ 2022 ఆదివారం సాయంత్రం 6:03 గంటల వరకు
హిందూ పంచాంగం ప్రకారం, ఉదయం తిథినే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఆదివారం రోజున ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో షాపింగ్ చేయడానికి, ఏదైనా పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
ధన త్రయోదశి వేళ ఈ పనులు చేయడం మరచిపోవద్దు...
ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరి జయంతి రోజునే ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, వినాయకుడు, కుభేరుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో మట్టితో తయారు చేసిన లక్ష్మీ గణపతి విగ్రహాలను తీసుకెళ్లి ఆరాధించాలి. అలాగే వెండి విగ్రహాలను కూడా కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటికి ఆ విగ్రహాలను తీసుకెళ్లాక ఆ విగ్రహాలను ఎర్రని లేదా పసుపు రంగులో ఉండే వస్త్రంపై ఉంచాలి. ఆ తర్వాత కుంకుమ తిలకం పెట్టి పూజను ప్రారంభించాలి. పూజ చేసే సమయంలో ఆ విగ్రహాల ముందు నాణెలను ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత వాటిని భద్రంగా మీ అల్మారాలో లేదా లాకర్ లో ఉంచుకుంటే సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
Related Posts:
> ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు కొంటె అంతే జాగ్రత్త
> ధన త్రయోదశి విశిష్టత ఏమిటి? ధన త్రయోదశి నాడు ఏం చేయాలి ?
ధన త్రయోదశి, dhantrayodashi puja, dhantrayodashi puja vidhi in telugu, when is dhanteras in 2022, lakshmi poojaa
Comments
Post a Comment