దీపావళి లక్ష్మీపూజకు ముహూర్తం ఇదే...
దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించుకోవడం, దీపాలు వెలిగించడం, కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడపడం, సంపదకు, శ్రేయస్సుకు, ఆరోగ్యానికి, ఆనందానికి మూలకారణమైన లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ.
అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగను 25వ తేదీన కాకుండా 24వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక అందుకు కారణం లేకపోలేదు. అక్టోబరు 25వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు సూర్య గ్రహణం వస్తుందని, అందుకే దీపావళి పండుగను గ్రహణం కారణంగా 24 వ తేదీన నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసుకోవడానికి సమయాన్ని ముహూర్తాన్ని కూడా పండితులు సూచిస్తున్నారు. దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 24 సోమవారం నాడు వస్తుంది. సాయంత్రం 5:42 గంటలకు ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజను సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ప్రారంభించాలి. ఎందుకంటే ఈ సమయంలో లగ్నం స్థిరంగా ఉంటుంది.
Related Posts:
> దీపావళి లక్ష్మీ పూజా విధానం.. వ్రత నియమాలు
> దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు
> దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం.
దీపావళి, లక్ష్మి పూజ, diwali festival, diwali 2022 date muhurat, diwali 2022 date telugu, diwali telugu, diwali meaning
Comments
Post a Comment