నవంబర్ (2022) నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ భవిష్య ఫలితాలు | November monthly results - November 2022
నవంబర్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ భవిష్య ఫలితాలు.
1) నవంబర్ నెల అంతగా అనుకూలంగా లేదు మంచికన్నా చెడు ఫలితాలు చెడు సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి.
2) ఈనెల రెండవ వారం నుండి చలి తీవ్రత విశేషంగా ఉంటుంది బాగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది.
3) జలగండం దేశానికి ఇప్పుడే పోలేదు.
4) ఈ నెలలో కూడా అధిక వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తాయి తుఫాను సూచన అలాగే భారీ వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడతాయి.
5) ఈ నెలలో దేశ ఆర్థిక స్థితి ప్రజల యొక్క ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది.
6) ఈ నెలలో వ్యాపారాలు మిశ్రమంగా కొంత ఒడిదుడుకులకు లోను అవుతుంది.
7) సాఫ్ట్వేర్ రంగానికి అంతగా అనుకూలంగా లేదు.
8) ఈ నెలలో రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.
9) రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది.
10) భూములకు సంబంధించినటువంటి వివాదం వివిధ ప్రముఖ వ్యక్తులకు చుట్టుకుంటుంది.
11) వివిధ ప్రమాదాల వలన సామూహిక మరణాలు భారీ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
12) దేశానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులకు పదవీ వియోగం కనిపిస్తుంది.
13) ఈ నెలలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
14) అగ్ని ప్రమాదాలు ఏ రూపంలోనైనా సంభవించవచ్చు అగ్ని ప్రమాదల వలన అనేక మంది మరణించే అవకాశం ఉన్నాయి.
15) పేలడం విస్పోటనం బాంబుదాడులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
16) పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ దేశ రాజకీయం అతలాకుతలం కాబోతోంది పాకిస్తాన్ కి రాబోవు ఆరు నెలలు పూర్తిగా చెడు సమయం.
17) బ్రిటన్ దేశానికి అరిష్టం దేశ ప్రధానమంత్రి కి కష్టం.
18) శ్రీలంక దేశంలో నూతన సమరం నూతన సమస్య.
19) ఆస్ట్రేలియా దేశానికి అగ్నిపరీక్ష.
20) ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఆపద.
21) రెండు తెలుగు రాష్ట్రాలకు సమయం పూర్తిగా అరిష్టం భారీ నష్టం ప్రతికూల సమయం.
22) విమాన ప్రమాదాలు హెలికాప్టర్ ప్రమాదాలు రైలు ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
23) ఈ నెలలో దేశంలో కొన్ని ప్రాంతాలలో హింసాత్మక వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
24) వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు అలాగే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
25) అత్యంత ప్రముఖ వ్యక్తులు వివిధ ప్రమాదాల వలన వివిధ ఇబ్బందుల వలన మరణించే అవకాశం కనిపిస్తుంది.
26) ప్రముఖుల మీద దాడులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
27) వివిధ ప్రముఖ వ్యక్తులు అరెస్ట్ అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక మోసాలు కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి.
28) వివిధ ప్రాంతాలలో వివిధ దేశాలలో భూకంపం ఏర్పడే సూచన కనిపిస్తుంది.
29) నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి విహారయాత్రలకు వెళ్లకపోవడం మంచిది.
30) విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలకు సమయం ప్రతికూలం.
31) ప్రఖ్యాతి పొందిన మహిళా మూర్తులకు ఈనెల అరిష్టం వారి విషయంలో చెడు వార్తలు.
32) రక్షణ రంగానికి చెందిన ప్రముఖులకు అలాగే రక్షణ రంగానికి చెందినటువంటి సైనికులకు ఈనెల అనుకూలంగా లేదు ప్రమాదకరం.
33) రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.
34) వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభం కాబోతుంది.
35) స్టాక్ మార్కెట్ రంగం ఒడిదుడుకులకు గురి అవుతుంది.
36) న్యాయస్థానాల నుండి సంచలమైనటువంటి తీర్పులు వస్తాయి.
37) మొత్తం మీద చూసుకుంటే ఈ నెలలో అధిక వర్షాలు కనిష్ట స్థాయి చలి వివిధ రూపాల్లో ఏర్పడే దన నష్టం ప్రాణ నష్టం సామూహికమరణాలు ప్రముఖులకు ఇబ్బందులు.
వీటన్నింటిని అధిగమించాలంటే ఈ శుభ కార్తీక మాసంలో హరిహరులను పూజించాలి.
ప్రతి ఒక్కరు ఆరు బయట సంధ్య దీపాన్ని వెలిగించాలి శివాలయంలో వైష్ణవాలయంలో దీపాలను వెలిగించాలి.
శ్రద్ధ భక్తులతో శివపురాణం విష్ణు పురాణం పారాయణం చేయాలి లేదంటే కార్తీక మాస పురాణం పారాయణం చేయాలి.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై
దేవి శుభాశీస్సులతో
మీ క్రాంతి పటేల్
శ్రీ భగలాముఖి సర్వ మంగళ సిద్ధ దత్త పీఠం
ఎల్లారెడ్డి
Follow Facebook : https://www.facebook.com/kranthi.patel.75
Famous Posts:
Tags : నవంబర్, november, november horoscope, november horoscope 2022, november horoscope 2022 astrosage, november horoscope 2022 sagittarius
Comments
Post a Comment