Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జనవరి 1వ తేదీన తిరుపతిలో ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చేది ఈ ప్రదేశంలోనే - Vaikunta Dwara Darshanam Free Tickets Tirumala-Tirupati

అధిక  సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం...

జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార ఉచిత దర్శనంకు రోజుకు  50వేలు వంతున మొత్తం అయిదు లక్షల టోకెన్లు తిర కేంద్రాల్లో   సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

జనవరి 2023 ఒకటవతేదీ (ఆదివారం) టోకెన్ల జారీ మొదలైతే అయిదు లక్షల టోకెన్లూ అయిపోయే వరకు అన్ని కేంద్రాల్లో 24 గంటలూ ఇస్తూనే ఉంటారు. తిరుమలలోని కేంద్రంలో మాత్రం తిరుమలలో నివాసం ఉన్న ఆదార్ కార్డు ఉన్న వారికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు కోసం తిరుమలకు వెళ్ళకండి.  తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఎవ్వరికైనా టోకెన్లు జారీ చేస్తారు. ఈ మెసేజ్ తో పాటు కేంద్రాల రూట్ మ్యాప్ పి.డి.ఎఫ్ జత చేశాము. చూడగలరు.

తిరుపతిలో టోకెన్స్ జారీ కేంద్రాలు.

1) భూదేవి కాంప్లెక్స్ ( అలిపిరి వద్ద)

2) రామచంద్ర పుష్కరిణి ( అలిపిరి కి దగ్గరగానే ఉంటుంది)

3) శ్రీనివాసం ( ఆర్టీసీ బస్టాండ్ వద్ద)

4) మున్సిపల్ ఆఫీసు ( శ్రీనివాసంకు దగ్గరగా ఉంటుంది)

5)గోవిందరాజు స్వామి సంత్రం ( రైల్వే స్టేషన్ వెనుక)

6) విష్ణు నివాసం ( రైల్వే స్టేషన్ ముందు)

7) MR పల్లి Z.P.హైస్కూల్

8) రామానాయుడు స్కూల్ 

9) జీవకోన Z.P.హైస్కూల్ 

10) తిరుమల - కౌస్తభం ( తిరుమల వాసులకు మాత్రమే)

మొదటి ఆరు కేంద్రాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటాయి 

ఈ టోకెన్‌ కేంద్రాల వద్ద భక్తుల కొరకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టి, కాఫీ అందిస్తాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం.

తిరుమల స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

ఉచిత టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలి.

తిరుపతిలో 9 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం కౌంటర్లకు  సులువుగా వెళ్లేందుకు వీలుగా ఆయా కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశాం. భక్తులు సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లను గుర్తించవచ్చు.

భక్తులకు సమాచారం ఇచ్చేందుకు గాను చెర్లోపల్లి జంక్షన్‌, తిరుచానూరు వద్ద పూడి రోడ్డు, నవజీవన్‌ ఆసుపత్రి వెనుక హైవే వద్ద తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా సమీపంలోని సర్వదర్శనం కౌంటర్ల క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తాం.

Tags: వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి, Vaikuntha Ekadashi, Tirumala Vaikuntha Ekadashi, Tirumala Tickets, Vaikunta Ekadashi Tickets Tirumala

Comments