Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీవారి భక్తులకు శుభవార్త అందుబాటులోకి అన్ని టికెట్లు విడుదల..| Tirumala News | TTD

ఫిబ్రవరి 22న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.

అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు.

ఫిబ్రవరి 25న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

శ్రీవాణి టికెట్లకు సంబంధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

ఆన్ లైన్ లో రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయి.

భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం

ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు

మార్చి నుండి 500 ఆన్‌లైన్, 400 తిరుమలలో, 100 విమానాశ్రయంలో

తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది.

ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.

మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి.

టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని కోరడమైనది.

Tags: TTD, Tirumala, Tirumala News, TTD Tickets, Tirumala Tirupati, Tirumala Updates

Comments