శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక : వసతి - సేవా టికెట్లు విడుదల..!! Tirumala online accommodation booking for March 2023
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ ప్రకటించింది.
ఇదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు పలు ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి నెలకు సంబంధించిన వసతి కోటాను ఈ రోజు విడుదల చేయనుంది.
మార్చి నెలకు సంబంధించిన తిరుమల, తిరుపతి, తలకోన వసతి కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అవసరమైన భక్తులు గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
రేపు (ఫిబ్రవరి 28)న మార్చినెల అదనపు శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి మరియు నవనీత సేవా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. పరకామణి సేవా టికెట్లను ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Tags: ttd, tirumla, tirupati, tirumala accommodation, ttd tickets, accommodation 2023
Comments
Post a Comment