Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల 10 వేల టికెట్ వివరాలు Tirumala Srivani Ticket Complete Details Ticket Cost Darshan Timings Rules

 

tirumala srivani trust ticket

తిరుమల శ్రీవారి దర్శనానికి చాల మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని సర్వదర్శనం ( ఉచిత దర్శనం ) దివ్య దర్శనం ( కాలినడకన నడిచి వెళ్లే  భక్తులకు ఇచ్చే టికెట్స్ ) , వీటితో పాటు 300/- టికెట్స్ అదేవిధంగా ఆర్జిత సేవ టికెట్స్ ఉన్నాయి . ఈ టికెట్స్ కాకుండా రికమండేషన్ లేటర్ ద్వారా వెళ్లే దర్శనాలు ఉన్నాయి . 

శ్రీవాణి దర్శనం టికెట్స్ లేదా 10000 రూపాయల టికెట్ గా పిలవబడుతూన్న ఈ టికెట్స్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం . శ్రీవాణి  ట్రస్ట్ SRIVANI TRUST అంటే అర్ధం SRI VENKATESWARA ALAYA NIRMANAM TRUST అని అర్ధం . టీటీడీ వారు చాల ప్రదేశాలలో నిర్మించే ఆలయాలకు సంబందించిన ట్రస్ట్ అన్నమాట . ఎవరైతే ఈ ట్రస్ట్ కు 10 వేల రూపాయలు డొనేషన్ ఇస్తారో వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు . 

శ్రీవాణి దర్శనం గురించి కొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు 

1) 10 వేలు కడితే ఎక్కడ నుంచి దర్శనం ఇస్తారు ?

జ ) వీరికి మొదటి గడప దర్శనం కల్పిస్తారు .. ఒక్కోసారి 3వ గడప వరకు తీస్కుని వెళ్తున్నారు అని భక్తులు చెప్పారు . 

2) 10 వేలు కడితే ఎంతమందికి దర్శనం ఇస్తారు ?

జ ) ఒక్కరికి మాత్రమే ఇస్తారు 

3) భార్య భర్త ఇద్దరు వెళ్లాలంటే ఎంత కట్టాలి ? పిల్లల్ని తీస్కుని వెళ్లవచ్చా ?

జ ) ఇద్దరికీ 20 వేలు డొనేషన్ ఇవ్వాలి , 12 సంవత్సరాల లోపు పిల్లల్ని టికెట్ లేకుండా తీస్కుని వెళ్ళవచ్చు 

4) టికెట్ ఎక్కడ ఇస్తున్నారు  ? 

జ ) శ్రీవాణి టికెట్స్ మూడు చోట్ల ఇస్తున్నారు . వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు , ఎయిర్ పోర్ట్ లో ఇస్తున్నారు కొండపైన గోకులం దగ్గర ఇస్తున్నారు 

5) మనకు కావాల్సిన తేదికి ఈ టికెట్స్ ఉంటాయా ?

జ ) టీటీడీ వెబ్సైటు లో మనం డొనేషన్ వేసే ముందు దర్శనం availlability ఉందొ లేదో చెక్ చేస్కోవచ్చు 

6) కొండపైన టికెట్స్ ఇస్తున్నారు కదా ఎప్పుడు తీసుకోవాలి ? టికెట్ తీస్కుని వెంటనే దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ?

జ ) కొండపైన టికెట్స్ ఒక రోజు ముందుగా తీసుకోవాలి 

7) శ్రీవాణి టికెట్స్ ఉన్న వారికీ రూమ్ ఇస్తారా ?

జ ) రూమ్ బుక్ చేస్కోవచ్చు కాకపోతే రూమ్ కి విడిగా డబ్బులు చెల్లించాలి 

8) 10 వేలు కడితే సరిపోతుందా అదనంగా ఏమైనా టికెట్ తీసుకోవాలా ?

జ ) 10 వేలు డొనేషన్ కట్టిన తరువాత బ్రేక్ దర్శనం టికెట్ 500 కట్టి తీసుకోవాలి . టికెట్ మొత్తం 10500 అవుతుంది 

9 ) మేము రెండు టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నాం ఎంత కట్టాలి ఒకేసారి 21 వేలు పే చెయ్యాలా ?

జ ) మీరు ముందుగా 20 వేలు డొనేషన్ కట్టాలి ఆ తరువాత బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి 

10 ) బ్రేక్ దర్శనం ఒకసారి బుక్ చేస్తే డేట్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా ?

జ ) ఒక వారం రోజులు ముందే టీటీడీ వారికి తెలియచేస్తే అవకాశం ఇస్తారు 

11 ) బ్రేక్ దర్శనం ఎన్ని గంటలకు ఉంటుంది ?

జ ) ప్రస్తుతం టైం మార్చారు ఉదయం 10 గంటలకు ఇస్తున్నారు 

12 ) టీటీడీ వెబ్సైటు ల్లో ఎలా బుక్ చేసుకోవాలి ?

జ ) మీరు ముందుగా https://tirupatibalaji.ap.gov.in/ వెబ్సైటు లో లాగిన్ అవ్వాలి ఆ తరువాత మెనూ లో  శ్రీవాణి ట్రస్ట్ పై క్లిక్ చెయ్యాలి డొనేషన్ పై మరల క్లిక్ చెయ్యాలి . డొనేషన్ కట్టే ముందు మీకు కావాల్సిన తేదీ కి దర్శనం ఉందొ లేదో చెక్ చేస్కోవచ్చు . 

18) ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె  ఏమి చెయ్యాలి ?

జ ) హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ కు మెసేజ్ చేయండి 8247325819

Tirumala srivani trust donation booking complete details. tirumala darshan rules tirumala temples guide updates.

Comments