Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

టీటీడీ కొత్త రూల్ నడిచి వెళ్లిన వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు | TTD New Rule Alipiri Steps Srivari Metlu

tirumala new rules alipiri steps

తిరుమల కాలినడకన వెళ్లేవారికి దివ్య దర్శన టోకెన్ లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇవ్వడం పునః ప్రారంభించారు. నడిచి వెళ్తే దర్శనం కూడా త్వరగా అవుతుందనే ఉద్దేశ్యంతో నడిచి వస్తాం అని మొక్కుకోక పోయిన నడిచే ఓపిక లేకపోయినా చాలామంది భక్తులు దివ్య దర్శన టోకెన్ ల కోసం గోవిందా గోవిందా అనుకుంటూ నడుచుకుంటూ కొండ ఎక్కుతున్నారు కాకపోతే ఇప్పుడు టీటీడీ దివ్య దర్శనం టోకెన్ లో అందరికి ఇవ్వడం లేదని భక్తులు చెప్పుకొస్తున్నారు .

తిరుమల దర్శనం కోసం టీటీడీ వారు ప్రతినెలా 300/- దర్శనం టికెట్స్ అదే విధంగా 500/- ఆన్లైన్ ఆర్జిత సేవ టికెట్స్ విడుదల చేస్తున్నారు ఈ టికెట్స్ కాకుండా తిరుపతి లో మూడు చోట్ల ఉచిత దర్శనం టికెట్స్ కూడా ఇస్తున్నారు రైల్వే స్టేషన్ దగ్గరగల గోవిందా రాజుల సత్రాలలోను , బస్సు స్టాండ్ కి దగ్గరకు గల శ్రీనివాసం లోను , అలిపిరి మెట్ల మార్గానికి దగ్గర్లో గల భూదేవి కాంప్లెక్స్ లోను ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి దర్శనం టికెట్స్ ఇస్తున్నారు .

టీటీడీ వారు ముందుగా తెలియచేసిన ప్రకారం అలిపిరి మెట్లమార్గం లో వెళ్లేవారికి 10 వేల దివ్య దర్శన టోకెన్ లు శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లే వారికీ 5 వేల దివ్య దర్శనం టోకెన్ లు కేటాయించింది . నడిచి వెళ్లినప్పటికీ భక్తులు ఎవరైతే ఇతర దర్శనం టికెట్ కలిగి ఉన్నారో వారికి మాత్రం దివ్య దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . చాల దూరం నుంచి వచ్చే భక్తులు స్వామి వారిని రెండు సార్లు దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశ్యం తో 300/- టికెట్ కలిగి ఉన్నప్పటికీ నడిచి వెళ్తే మరొక దర్శనం టికెట్ వస్తుంది కదా అని వెళ్లినప్పటికీ సిస్టమ్ లో వారికీ టికెట్ ఉందని తెలియడం తో మరో టికెట్ ఇవ్వడం లేదు భక్తులు నిరాశతో గోవిందా గోవిందా అంటూ వెళ్తున్నారు .

keywords : tirumala latest information, aliripiri divya darshanam tokens , srivari mettu updates. tirumala hindu temples guide. today tirumala news

Comments