తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ | Tirumala Modati Gadapa Darshanam Rules Booking Process Ticket Cost
1) మొదటి గడప దర్శనం టికెట్స్ అంటే ఏ సేవలు ?
జ ) సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన , నిజపాద దర్శనం
2) నిజపాద దర్శనం ఇప్పుడు ఉందా ?
జ ) ఈ మధ్య నిజపాద దర్శనం సేవను రద్దు చేశారు .. ప్రస్తుతం లేదు
3 ) సుప్రభాతం సేవ నాలుగు టికెట్స్ వచ్చే నెలకు కావాలి బుక్ చేయడం ఎలా ?
జ ) మొదటి గడప దర్శనం సేవ లు అన్ని లక్కీ డ్రా చేసేసారు మనం బుక్ చేయడానికి కుదరదు
4) లక్కీ డ్రా అంటే ఎలా ? ఎప్పుడు రిలీజ్ చేస్తారు ?
జ ) టీటీడీ వెబ్సైటు https://tirupatibalaji.ap.gov.in/#/login లో ప్రస్తుతం 3 నెలల ముందుగానే టికెట్స్ విడుదల చేస్తున్నారు . ఇంతకు ముందు ప్రతి నెల మొదటి శుక్రవారం విడుదల చేసేవారు ప్రస్తుతం ప్రతి నెల 20 దాటినా తరువాత విడుదల చేస్తున్నారు
5) లక్కీ డ్రా లో అన్ని సేవలకు మనం డ్రా వేయవచ్చా ?
జ ) అన్ని సేవలకు అన్ని రోజులకు మనం వేయవచ్చు
6 ) ఆడవారికి అన్ని రోజులు కుదరదు కదా మనం కావాల్సిన రోజులకే సెలెక్ట్ చేసుకోవచ్చా ?
జ ) అవును మనం కావాల్సిన రోజులకే డ్రా వేస్కొవచ్చు అదే విధంగా కావాల్సిన సేవకే వేస్కొవచ్చు
7) అన్ని సేవలకు డ్రా వేస్తె ఒకసారి రెండు లేదా ఎక్కువ సేవ లు డ్రా లో వస్తాయా ?
జ ) అన్ని సేవలకు మనం వేసిన ఒక్క సేవనే వస్తుంది
8) ఒకసారి సేవ లో సెలెక్ట్ అయిన తరువాత మరల మనం వచ్చే నెలకు మరల వేసుకోవచ్చా ?
జ ) ఒకసారి సెలెక్ట్ అవితే మనం 180 రోజులు వరకు సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు
9) మనం డ్రా వేసినప్పుడే డబ్బులు కట్టాలా ?
జ ) మనం ఏ సేవ లో సెలెక్ట్ అవుతామో ఆ సేవ కె డబ్బులు కట్టాలి
10) సెలెక్ట్ అయ్యామో లేదో ఎలా తెలుస్తుంది ?
జ ) సెలెక్ట్ అయినవారికి టీటీడీ వారు మెసేజ్ చేస్తారు మనం టీటీడీ వెబ్సైటు లో ఎలక్ట్రానిక్ డిప్ పై క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది
11 ) డ్రా వేయడానికి ఎంత సమయం ఇస్తారు ?
జ ) మనం డ్రా లో పాల్గొనడానికి 2 రోజులు సమయం ఇస్తారు
12 ) డబ్బులు కట్టానికి సమయం ఇస్తారా ?
జ ) సేవలో సెలెక్ట్ అయినవారు డబ్బులు కట్టి టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవాలి . డబ్బులు కట్టడానికి మనకు సుమారు 2 రోజులు సమయం ఇస్తారు
13) సేవ లో సెలెక్ట్ అయినా తరువాత డబ్బులు కట్టకపోతే ఏమౌతుంది ?
జ ) సేవ లో సెలెక్ట్ అవి డబ్బులు కట్టకపోతే టికెట్ ను రద్దు చేస్తారు .. ఆలా డబ్బులు కట్టలేని టికెట్స్ కు మరల డ్రా తీస్తారు .
14) టికెట్ కు అమౌంట్ కట్టలేని వారికి తరువాత నెల బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ?
జ ) ఉంటుంది
15) ఒక టికెట్ పై ఎంత మంది వెళ్ళవచ్చు ?
జ ) ఒక టికెట్ పై ఇద్దరు వెళ్ళవచ్చు .. 12 లోపు పిల్లలను తీస్కుని వెళ్ళవచ్చు
16) పిల్లలు 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఏమి చెయ్యాలి ?
జ ) వారికి విడిగా టికెట్ బుక్ చెయ్యాలి . కాకపోతే మీకు పిల్లలకు ఇద్దరికీ ఒకేసారి లక్కీ డ్రా వచ్చే అవకాశం ఉండదు కనుక ఈ టికెట్స్ లలో అందరు కలిసి వెళ్ళడానికి అవకాశం ఉండదు
17) ఒక లాగిన్ లో ఆధార్ తోనూ మరొక లాగిన్ లో ఓటర్ కార్డు ద్వారా చేసుకోవచ్చా ?
జ ) ఆ విధంగా చేస్కోవచ్చు
18) లక్కీ డ్రా టికెట్ వస్తే మరల మరుసటి రోజు 300 టికెట్ లేదా ఫ్రీ దర్శనం కి వెళ్లవచ్చా ?
జ ) వెళ్ళవచ్చు
19) మొదటి గడప దర్శనం వచ్చిన వారికీ రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అందరి తో పాటు రూమ్ బుక్ చేసుకోవాలా ?
జ ) అందరితో పాటు చేసుకోవాలి
20) మొదటి గడప దర్శనం బుక్ చేసుకోవడం లో వృద్దులకు ఏమైనా ప్రత్యేక కోట ఉంటుందా ?
జ ) అలాంటిది ఏమి ఉండదు
21 ) మొదటి గడప దర్శనం ఆన్లైన్ లో మాత్రమేనా ఆఫ్ లైన్ లో కొండపైన ఎక్కడైనా ఇస్తారా ?
జ ) online లోనే చేసుకోవాలి కొండపైన cro ఆఫీస్ లో ప్రతి రోజు మరుసటి రోజుకి లక్కీ డ్రా ఉంటుంది . ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్టర్ చేస్కోవచ్చు . సాయంత్రం 6 గంటలకు రిజల్ట్స్ వస్తాయి . cro లో టికెట్ వచ్చినవారు డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలి
22) టికెట్ ధరలు ఎంత ఉంటాయి ?
సుప్రభాతం - 120 , తోమాల - 220/- , అర్చన 220 /- అష్టదళ పాదపద్మారాధన 1250/-
23) లక్కీ డ్రా ద్వారా కాకుండా వేరేలా వెళ్లవచ్చా ?
జ ) MLA , MP , టీటీడీ బోర్డు మెంబెర్స్ మరియు ఇతర అధికారుల లెటర్స్ ద్వారా వెళ్ళవచ్చు . టికెట్ ధరలు వీరికి వేరేగా ఉంటాయి .
23) ఇంకా మీకు డౌట్స్ ఉంటే ?
జ ) హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు మెసేజ్ చేయండి
ఇవి కూడా చదవండి :
>> తిరుమల 500/- దర్శనం టికెట్ వివరాలు / ఆన్లైన్ సేవ టికెట్ గురించి పూర్తీ సమాచారం
>> తిరుమల 10 వేల రూపాయల శ్రీవాణి టికెట్ గురించి పూర్తీ వివరాలు
>> తిరుమల నడిచి వెళ్తున్నారా ముందుగా ఈ విషయం తెలుసుకోండి వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు
TIRUMALA, TIRUMALA UPATES, TIRUMALA INFORMATION, TIRUMALA SUPRABHATAM TICKET RULES, TIRUMALA TOMALA SEVA, TIRUMALA ARCHANA, TIRUMALA ABHISEKAM, TIRUMALA MODATI GADAPA TICKETS, TIRUMALA LUCKY DIP RULES, HINDU TEMPLES GUIDE
You have given clear information regarding darshan of Lord . Thanks
ReplyDelete