Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల దర్శనం టికెట్స్ రూమ్స్ బుక్ కాలేదా ఇలా చెయ్యండి | Tirumala New Darshanam Rules May June Tirumala Trip Planning


Tirumala Latest Information

ఓం నమో వేంకటేశాయ . వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీస్కుని తిరుమల వెళ్లి కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కుల వాడు అనాధ రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించి రావాలని తల్లి దండ్రులు భావిస్తారు . తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు అన్ని టికెట్స్ ఆన్లైన్ లో విడుదల చెయ్యడం వలన చాలామందికి టికెట్స్ మరియు రూమ్స్ దొరకక తిరుమల యాత్ర ఎలా ప్లాన్ చేసుకోవాలి ? అక్కడకు వెళ్తే దర్శనం అవుతుందా ? పిల్లలతో వెళ్తున్నాం ఇబ్బంది పడాలేమో అని అనుకుంటూ మన హిందూ టెంపుల్స్ గైడ్ కు యాత్ర ఎలా ప్లాన్ చేయమంటారు అని వాట్స్ యాప్ లో మెసేజ్ లు చేస్తున్నారు వారికి చెప్పిన సమాధానాలు ఇక్కడ ఇస్తున్నాను మీకు కూడా ఉపయోగపడగలవు . 

ఉచిత దర్శనం ప్రశ్నలు జవాబులు

1) 300 రూపాయల టికెట్స్ మే  జూన్ నెలకు అదనపు కోట లాగ మరల విడుదల చేస్తారా ?

జ ) అదనంగా విడుదల చెయ్యరు 

2) తిరుపతి లో కానీ తిరుమలలో కానీ 300/- టికెట్స్ ఇస్తున్నారా ?

జ ) ఎక్కడ ఇవ్వడం లేదు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి 

3)ఇప్పుడు ఉచిత దర్శనాలు ఉన్నాయా ? టికెట్ తీసుకునే రావాలా ?

జ ) ఉచిత దర్శనాలు ఉన్నాయి . తిరుపతి లో మూడు చోట్ల టికెట్స్ ఇస్తున్నారు . ఈ టికెట్స్ ఉదయం 5 గంటల నుంచి ఇస్తారు. ఇచ్చే ప్రదేశాలు

1) విష్ణు నివాసం ( రైల్వే స్టేషన్ ఎదురుగా)

2) గోవింద రాజుల సత్రాలు ( రైల్వే స్టేషన్ వెనకాల) 

3) శ్రీనివాసం (బస్ స్టాండ్ కి ఎదురుగా )

ఈ టికెట్ ఏ రోజుకి ఆ రోజే ఇస్తారు .. ఆ రోజు దర్శనం టికెట్స్ అయిపోతే మరుసటి రోజుకి కూడా ఇస్తున్నారు . 

4) ఉచిత దర్శనం టికెట్స్ టైం స్లాట్ టికెట్స్ ? ఆ సమయం లోనే వెళ్లాలా ?

జ ) అవును ముందుగానే మనం లైన్ లోకి ఎప్పుడు వెళ్లాలో టైం ఇస్తారు . 

5) ఇచ్చిన టైం లోనే వెళ్లాలా ? ముందుగా వెళ్తే పంపిస్తారా ?

జ ) రూల్ ప్రకారం ఇచ్చిన టైం కి ఒక గంట ముందు పంపిస్తారు ... రద్దీ పెద్దగా లేకపోతే మనం ఇంకా ముందుగానే వెళ్ళవచ్చు . 

6) మాలో కొందరికి ఒక టైం , మరికొంత మందికి ఇంకొక టైం వస్తే అందరం కలిసి ఒకే టైం కి వెళ్లవచ్చా ?

జ ) మీరు తేదీ మారకుండా అదే రోజు అందరు కలిసి వెళ్ళవచ్చు 

7) ఉచిత దర్శనం టికెట్స్ అందరు తీసుకోవాలా ? అందరు లైన్ లో నిలబడాలా ?

జ ) 12 సంవత్సరాల లోపు పిల్లలకు అవసరం లేదు .. మిగిలిన వారు అందరు ఆధార్ కార్డు పట్టుకుని లైన్ లో  నిలబడాలి 

8) మాకు 300 రూపాయాల టికెట్ ఉంది ఫ్రీ టికెట్ ఇస్తారా ?

జ ) అదే రోజుకు ఇవ్వరు .. ముందు రోజు కానీ ఆ తరువాత రోజుకి కానీ తీస్కోవచ్చు 

9) ఏ టికెట్స్ లేకుండా కొండపైకి వెళ్తే దర్శనం ఉంటుందా ?

జ ) ఏ టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళవచ్చు అక్కడ టికెట్ లేనివారికి ప్రత్యేక లైన్ ఉంటుంది . 

నడకదారి ప్రశ్నలు జవాబులు 

1) నడిచి వెళ్లేవారికి ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా ? టికెట్ ధర ఎంత ?

జ ) ఇప్పుడు నడిచి వెళ్లేవారికి దర్శనం టికెట్స్ ఇస్తున్నారు .. ఇవి ఉచిత దర్శనం టికెట్స్ నడిచి వెళ్లేవారికి ఇచ్చే టికెట్స్ ను దివ్య దర్శనం టికెట్స్ అని అంటారు . ఉచిత దర్శనం టికెట్స్ ను సర్వదర్శనం టికెట్స్ అని పిలుస్తారు . 

2) టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఏ సమయం లో ఇస్తారు ?

👉 అలిపిరి మెట్ల మార్గం లో వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్ లో తీస్కోవాలి . ఆ టికెట్స్ తీసుకున్న తరువాత  అలిపిరి మెట్లమార్గం మధ్య లో ఈ టికెట్స్ ను స్కాన్ చేస్తారు .  ఉదయం 3 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు 

👉 శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికి మెట్ల మార్గం మధ్యలో ఇస్తున్నారు. ( 6am -6pm)

3) నేను వెళ్లి మా ఫ్రెండ్స్ కు టికెట్స్ తీసుకోవచ్చా ?

జ ) ఆలా ఇవ్వరు . ఎవరికీ వారే ఆధార్ కార్డు లను చూపించి తీసుకోవాలి 

4) అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ ?

జ ) ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. రాత్రి 9 దాటినా తరువాత వెళ్లడం మంచిది కాదు . 

5) శ్రీవారి మెట్ల మార్గం ఎప్పుడు ఓపెన్ చేస్తారు ?

జ ) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 

6) లగేజి ఎక్కడ ఇవ్వాలి ? కొండపైన ఎక్కడ తీసుకోవాలి ?

జ ) మెట్ల మార్గం నుంచి  వెళ్లే వారు తమ లగేజీని క్రిందనే ఇచ్చేయవచు . టీటీడీ వారు ఆ లగేజీని కొండపైకి తీస్కుని వస్తారు . మనం కొండపైకి వెళ్ళగానే చివరి మెట్టు పూర్తీ అవ్వగానే దగ్గర్లో లగేజి కౌంటర్ ఉంటుంది . మీరు అక్కడ తీస్కోవచ్చు . ఇదంతా ఉచిత సర్వీసు . 

7) 300 రూపాయల టికెట్ ఉండి నడిచి వెళ్తే టికెట్ ఇస్తారా ?

జ ) 300 టికెట్ ఉన్నవారికి టికెట్ ఇవ్వడం లేదు 

 రూమ్ బుక్ కాలేదు 

1) మాకు రూమ్స్ లేవు కొండపైన ఎక్కడ ఇస్తారు ?

జ ) కొండపైన cro ఆఫీస్ దగ్గర ఇస్తారు 

2) ఎప్పుడు వెళ్తే రూమ్ ఇస్తారు ? టైమింగ్స్ చెప్పండి 

జ ) 24 గంటలు ఓపెన్ లోనే ఉంటుంది . 

3) రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి ? ఎంత మంది ఉండవచ్చు ?

జ ) 50 , 100,500 ఉంటాయి . ఒక రూమ్ లో 4 గురు ఉండవచ్చు . ఇంకా ఎక్కువ ఉన్న ఎవరు అడగరు . 

4) మేము ఆన్లైన్ లో రూమ్ చేస్కున్నాము ఏ టైం కి రావాలి ?

జ ) మీరు బుక్ చేసుకున్న టికెట్ పై టైం ఉంటుంది ఆ సమయం లోనే వెళ్ళాలి . టైం దాటితే మనకు రూమ్ ఇవ్వరు .

ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటె హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ 8247325819 కు వాట్స్ యాప్ లో అడగవచ్చు . 

ఇవి కూడా చదవండి : 

#తిరుమల #tirumala tirumala may june darshan rules , 

Comments