తిరుమల ఆన్లైన్ సేవ బుక్ చేసే ముందు తెలుసుకోండి | Tirumala Online Seva and Darshan Booking Rules Hindu Temples Guide
ఓం నమో వెంకటేశాయ .. కరోనా సమయం లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ సేవ లు మొదలు పెట్టారు . ఈ online seva ( Virtual Participation ) యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే భక్తులు సేవలను టీవీ లో చూస్తూరు ఒక సంవత్సరం లోపు వారు దర్శనానికి రావచ్చు . సేవ లో పాల్గొనేవారు వారి పేర్లతో పాటు ఆధార్ లు వివరాలతో పాటు గోత్రాలు కూడా ఇవ్వాలి . మరో సారి చెబుతున్నాను సేవ మీరు టీవీ లో చూడాలి . కరోనా పోయిన ఆన్లైన్ సేవ ఇప్పటికి ఉంది చాలామంది భక్తులకు ఈ సేవ ల గురించి చాల ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం .
1) ఆన్లైన్ సేవ అంటే ఏమేమి సేవ లు ఉంటాయి వాటి ధరలు ఎంత ?
జ ) ఆర్జిత సేవలు అన్ని కూడా ఆన్లైన్ సేవ లు చేసారు ఆర్జిత సేవ లు అనగా ముఖ్యంగా కళ్యాణం , ఆర్జిత బ్రహ్మోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ ఈ సేవ టికెట్ ధర 500/- రూపాయలు . కళ్యాణం టికెట్ ధర 1000 రూపాయలు.
2) ఆర్జిత సేవ లు బుక్ చేసుకున్నప్పుడు పిల్లలను తీస్కుని వెళ్లవచ్చా ?
జ ) 12 సంవత్సరాల లోపు వారిని తీస్కుని వెళ్ళవచ్చు
3) ఆన్లైన్ సేవ బుక్ చేసుకుంటే దర్శనం ఉంటుందా ?
జ ) ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్న వారికీ దర్శనం ఉంటుంది సేవ మాత్రం టీవీ లో చూడాలి
4) మనకు కావాల్సిన రోజు దర్శనానికి వెళ్లవచ్చా ?
జ ) మనం సేవ బుక్ చేస్కునే టప్పుడు దర్శనం ఉందా లేదా అని మనం చెక్ చేస్కోవచ్చు
5) మేము సేవ బుక్ చేస్కున్నాము దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి ?
జ ) మీరు సేవ బుక్ చేసిన తరువాత Transaction History పై క్లిక్ చేసి Virtual Seva ను సెలెక్ట్ చేయండి . మీరు బుక్ చేసిన టికెట్ కనిపిస్తుంది . ఆ టికెట్ క్రింద Darshan కి ఎదురుగా Book Darshan పై క్లిక్ చేస్తే కేలండర్ ఓపెన్ అవుతుంది . మీకు కావాల్సిన తేదీన సెలెక్ట్ చేస్కోవచ్చు .
Comments
Post a Comment